Abn logo
Oct 31 2020 @ 15:18PM

మరో హ్యాపీ స్టోరి అంటున్న నమత్ర

Kaakateeya

టాలీవుడ్ సూపర్ స్టార్‌గా దూసుకుపోతున్న మ‌హేష్‌ బాబుకి సామాజిక స్పృహ‌ కూడా చాలా ఎక్కువే. ఇప్పటికే ఆయన తెలుగు రాష్ట్రాల్లో రెండు పల్లెటూళ్లను దత్తత తీసుకుని సొంత ఖర్చుతో అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన విషయం తెలిసిందే. అలాగే నిరు పేద‌ల‌కి ఆయన అండ‌గా ఉంటున్నాడు. చిన్నారుల‌కి హార్ట్ ఆప‌రేష‌న్స్ చేయిస్తూ వారి కుటుంబాల‌లో ఆనందం నింపుతున్నారు మ‌హేష్‌. ఆంధ్రా హాస్పిటల్స్ సహకారంతో హెల్త్ చెకప్‌లు నిర్వహించడమే కాకుండా అవ‌స‌ర‌మైన వారికి స‌ర్జ‌రీలు కూడా చేయిస్తూ.. ఇప్పటికి గుండె సంబంధిత వ్యాధుల‌తో బాధ ప‌డుతున్న 1000కి పైగా చిన్నారులకు హార్ట్ స‌ర్జ‌రీలు చేయించి రియ‌ల్ హీరో అనిపించుకుంటున్నాడు మ‌హేష్‌. తాజాగా ఓ చిన్నారికి గుండె ఆపరేషన్‌ జరిగింది. దీనిపై మహేశ్‌ శ్రీమతి నమ్రతా శిరోద్కర్‌ స్పందించారు. ఆంధ్రా హాస్పిటల్స్‌ వారి సహకారంతో ఎంబీఫర్‌సేవింగ్‌హార్ట్స్‌ కార్యక్రమంలో భాగంగా తనుశ్రీ అనే పాపకు గుండె ఆపరేషన్‌ జరిగిందని, తను సేఫ్‌గా ఉందని తెలిపారు నమత్ర. 



Advertisement
Advertisement