Abn logo
Oct 30 2020 @ 10:02AM

ప్రభుత్వ అరాచకాలకు ప్రజలే బుద్ధి చెబుతారు: నక్కా ఆనందబాబు

Kaakateeya

గుంటూరు: ప్రభుత్వ అరాచకాలకు ప్రజలే బుద్ధి చెబుతారని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు నక్కా ఆనందబాబు వ్యాఖ్యానించారు. రాజధాని రైతులకు సంకెళ్లు వేయడంపై నక్కా ఆనందబాబు నిరసన వ్యక్తం చేశారు. అంబేద్కర్ విగ్రహం సాక్షిగా చేతులకు బేడీలు వేసుకుని నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘అమరావతి ఉద్యమానికి పోటీగా పెయిడ్ ఉద్యమానికి తెరదీశారు. ఇదేంటని ప్రశ్నించిన రైతులపై అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేశారు. బేడీలు వేసి మరీ జైళ్లకు తరలించారు. అసలు ఏపీలో మానవ హక్కులు ఉన్నాయా? ఎస్సీలపైనే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ పెట్టడం చరిత్రలో ఎక్కడా లేదు. ఫిర్యాదు చేసిన వ్యక్తి కేసు విత్ డ్రా చేసుకుంటే డీఎస్పీ దుర్గా ప్రసాద్ ఒప్పుకోలేదు.  కక్షపూరితంగానే డీఎస్పీ రైతులను దసరా రోజు అరెస్ట్ చేసి జైలుకు పంపారు. 33 వేల ఎకరాల పొలం ఇచ్చిన రైతులకు బేడీలు వేసి అవమానిస్తారా? ప్రభుత్వం ఎన్ని అరాచకాలు చేసిన రైతులు మొక్కవోని దీక్షతో ముందుకు సాగుతున్నారు’ అని కొనియాడారు.

Advertisement
Advertisement