Abn logo
Oct 23 2020 @ 04:46AM

‘నాయిని’ మృతి బాధాకరం

Kaakateeya

మంత్రులు సబితారెడ్డి, మల్లారెడ్డి


ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి అర్బన్‌ / మేడ్చల్‌ అర్బన్‌ : తెలంగాణ ఉద్యమనేత, మాజీమంత్రి నాయిని నర్సింహారెడ్డి మృతి బాధాకరమని మంత్రులు సబితారెడ్డి, మల్లారెడ్డి అన్నారు. మినిస్టర్‌ క్వార్టర్స్‌లో మాజీ హోంమంత్రి నాయిని పార్థివదేహానికి వారు పూలమాలలు సమర్పించి నివాళులర్పించారు. తెలంగాణ ఉద్యమంలో నాయిని పాత్రం మరువలేనిదన్నారు. ఆయన మరణం టీఆర్‌ఎస్‌ పార్టీకి, తెలంగాణ సమాజానికి తీరని లోటన్నారు. నాయిని పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలన్నారు. కుటుంబ సభ్యులకు భగవంతుడు దైర్యాన్ని ఇవ్వాలని, ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. 

 

అనంతరం జడ్పీ చైర్‌పర్సన్‌ తీగల అనితారెడ్డి, మల్కాజిగిరి పార్లమెంటరీ టీఆర్‌ఎస్‌ ఇన్‌చార్జి మర్రి రాజశేఖర్‌రెడ్డి నాయిని మృతదేహం వద్ద నివాళులర్పించారు. 

Advertisement
Advertisement