Abn logo
May 4 2021 @ 14:28PM

పోలీసులపై అక్రమ మద్యం తయారీదారుల దాడి, 25 మంది అరెస్టు

నాగపూర్: అక్రమ మద్యం అటకట్టించేందుకు రెయిడ్స్‌కు వెళ్లిన పోలీసు సిబ్బందిపై కొందరు దాడి చేసిన ఘటన మహారాష్ట్రలోని నాగపూర్ జిల్లాలో చోటు చేసుకుంది. ఈ ఘటనతో ప్రమేయమున్న 25 మందిని పోలీసులు అరెస్టు చేశారు. సంఘటన వివరాల ప్రకారం, 10 మంది సిబ్బందితో కూడిన నాగపూర్ పోలీస్ పార్టీ రామ్‌టెకె నగర్ (టోలి)లోని అక్రమ మద్యం తయారీ ప్రాంతాలపై దాడులు చేసింది. పోలీసుల రెయిడింగ్ సమచారం తెలుసుకున్న అక్రమ మద్యం తయారీదారులు, వారి మద్దతుదారులు పెద్దఎత్తున అక్కడకు చేరుకుని పోలీసులపై రాళ్లు రువ్వారు. వీరిలో మహిళలు, యువకులు కూడా ఉన్నారు. ఈ దాడిలో పోలీసు వాహనం ముందుభాగం తీవ్రంగా దెబ్బతింది. సమాచారం తెలుసుకున్న సీనియర్ పోలీసు అధికారులు, అల్లర్ల అదుపు పోలీసు (ఆర్‌సీపీ) బృందం హుటాహుటిన అక్కడకు చేరుకుంది. ఘటనతో ప్రమేయమున్న 25 మందిని అదుపులోకి తీసుకున్నారు. భారీగా పోలీసు బలగాలను మోహరించారు.

Advertisement
Advertisement
Advertisement