వరుస చిత్రాలను ఓకే చేస్తూ.. వాటి షూటింగ్స్‌లో పాల్గొంటూ యువ కథానాయకుడు నాగశౌర్య మంచి స్పీడుమీదున్నాడు. ప్రతి సినిమాకు లుక్ పరంగానూ వేరియేషన్స్ చూపిస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నాడు. ఈ క్రమంలో నాగశౌర్య చేస్తున్న 20వ చిత్రం స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. తొలిసారి విలువిద్య క్రీడకు సంబంధించిన అంశంతో రూపొందుతోన్న ఈ సినిమా కోసం నాగశౌర్య సిక్స్ ప్యాక్ లుక్‌లో తయారయ్యాడు. ఈ సినిమా టైటిల్‌ను సోమవారం సాయంత్రం అనౌన్స్ చేస్తామని నిర్మాతలు తెలిపారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా టైటిల్‌పై పలు రకాల వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. లేటెస్ట్ సమాచారం మేరకు ఈ సినిమాకు ‘లక్ష్య’ అనే టైటిల్‌ను అనుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కొన్ని గంటల్లోనే ఈ సినిమా టైటిల్‌కు సంబంధించిన సస్పెన్స్ వీడనుంది. ఈ చిత్రాన్ని శ్రీ వేంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి, నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్స్ కలిసి నిర్మిస్తున్నాయి. సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం వహిస్తున్నారు.