Abn logo
Oct 31 2020 @ 18:38PM

'వాల్మీకి' టైటిల్‌పై గొడవ చేసిన వారికి ఇది తెలుసా?: నాగబాబు

Kaakateeya

మెగా ప్రిన్స్‌ వరుణ్‌ తేజ్‌ హీరోగా.. హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'గద్దలకొండ గణేష్‌'. ఈ చిత్రానికి ముందుగా ప్రకటించిన పేరు 'వాల్మీకి'. అయితే ఈ టైటిల్‌ ప్రకటన తర్వాత కొందరు గొడవలకు దిగిన విషయం తెలిసిందే. విడుదలకు చివరి నిమిషంలో.. టైటిల్‌ని 'గద్దలకొండ గణేష్‌'గా టైటిల్‌ మార్చారు. అయితే ఈ టైటిల్‌ మార్చడానికి ముందు దర్శకుడు హరీష్‌ శంకర్‌.. సినిమాలో వాల్మీకి మహర్షిని ఈ సినిమాలో కించపరచలేదని, ఆయన గురించి చాలా గొప్పగా చెప్పడం జరిగిందని తెలిపినా గొడవలు ఆగలేదు. దాంతో చేసేది లేక చిత్రయూనిట్‌ టైటిల్‌ మార్చి సినిమాని రిలీజ్‌ చేసింది. ఆ సినిమా విడుదలై.. విజయం సాధించి కూడా చాలా కాలం అవుతుంది.. మళ్లీ ఇప్పుడు ఆ సినిమా గురించి ఎందుకు? అనే అనుకుంటున్నారు కదా!. వాల్మీకి మహర్షి జయంతి నేడు (అక్టోబర్‌ 31). ఆయన జయంతిని పురస్కరించుకుని.. మెగాబ్రదర్‌ నాగబాబు.. తన కుమారుడు నటించిన సినిమా గురించి ప్రస్తావిస్తూ.. వాల్మీకి జయంతి శుభాకాంక్షలు తెలిపారు.


''ఆరోజు 'వాల్మీకి' అని టైటిల్ పెడితే గొడవ చేసిశారు  కదా. 

వాళ్ళకి మరి ఈరోజు వాల్మీకి జయంతి అని గుర్తు ఉండేవుంటుంది. 

Anyways..

 హ్యాపీ బర్త్డ్‌డే "వాల్మీకి" గారు.

నాకు నచ్చిన మంచి మాస్ కథలు రాసేవాళ్ళలో మీరు ప్రథములు. రాముని జీవితాన్ని బాగా రాసినందుకు ధన్యవాదములు.." అని నాగబాబు తన ట్వీట్‌లో పేర్కొన్నారు.


Advertisement
Advertisement