Abn logo
Jul 9 2020 @ 10:48AM

నాగ్ ఆ రీమేక్ చేస్తున్నారా?

`కింగ్` నాగార్జున ప్రస్తుతం `వైల్డ్ డాగ్` చిత్రం చేస్తున్నారు. నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నాగార్జున పోలీస్ అధికారిగా కనిపించబోతున్నారు. అలాగే దర్శకుడు ప్రవీణ్ సత్తారుకు కూడా ఓకే చెప్పినట్టు సమాచారం. ఈ రెండు సినిమాలతో పాటు మరో సినిమాను కూడా నాగ్ లైన్లో పెట్టారట.


బాలీవుడ్‌లో విజయవంతమైన `రైడ్` సినిమాను తెలుగులోకి రీమేక్ చేయాలని నాగార్జున భావిస్తున్నారట. ఈ సినిమా రీమేక్ గురించి నాగ్ ఎప్పట్నుంచో ఆలోచిస్తున్నారట. ఓ యంగ్ డైరెక్టర్‌కు ఈ రీమేక్ బాధ్యతలను అప్పగించనున్నారట. త్వరలోనే ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన రాబోతున్నట్టు సమాచారం. 


Advertisement
Advertisement
Advertisement