Advertisement
Advertisement
Abn logo
Advertisement

నేటి పాలన రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం

అంబేడ్కర్‌ వర్ధంతి వేడుకల్లో నాదెండ్ల మనోహర్‌

వన్‌టౌన్‌, డిసెంబరు 6 : రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నంగా నేటి పాలకులు వ్యవహరించడం చాలా బాధాకరమని జనసేన పార్టీ పొలిటికల్‌ ఎఫైర్స్‌ కమిటీ చైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ అన్నారు. అంబేడ్కర్‌ వర్ధంతి సందర్భంగా పార్టీ నగర అధ్యక్షుడు పోతిన మహేశ్‌తో కలిసి సోమవారం తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద ఉన్న అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం నాదెండ్ల మాట్లాడుతూ మహనీయుల త్యాగాలను స్మరించుకుంటూ ముందుకు వెళ్లాల్సిన పాలకులు అందుకు భిన్నంగా ఎస్సీ, ఎస్టీ సంక్షేమ నిధులను సైతం పక్కదోవ పట్టిస్తున్నారని ఆవేదన వెలిబుచ్చారు. ఇప్పటికైనా పాలకులు కళ్లు తెరవాలని, వెనుకబడిన వర్గాల సంక్షేమం కోసం పాటుపడాలని కోరారు. రాజ్యాంగ ఫలాలను అందరికీ అందించాలన్నదే జనసేన లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ ఉపాధ్యక్షుడు సోమనాథం, టి.మైనర్‌బాబు, గన్ని రాము, దోమకుండ మేరీ, నారాయణ ప్రదీప్‌రాజ్‌, సోము, గోవిందు, ఆకారపు విజయకుమారి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement