Advertisement
Advertisement
Abn logo
Advertisement

అక్కడ సీఎం పర్యటించక పోవడం దారుణం: నాదెండ్ల మనోహర్

కడప: రాజంపేట మండలం వరద ప్రభావిత ప్రాంతాల్లో నాదెండ్ల మనోహర్ పర్యటించారు. రాజంపేట మండలం తోగురు పేట, మందపల్లి, పులపత్తూరు గ్రామాల్లో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రజాప్రతినిధులకు తమ బిడ్డగా భావించి గెలిపిస్తే ఈ జిల్లా వాసి అయిన సీఎం పర్యటించక పోవడం దారుణమన్నారు. హెలికాప్టర్‌లో తిరిగితే ప్రయోజనం ఏమిటి? రెండు కోట్లు ఎంత వరకు సరిపోతుంది? అని ఆయన ప్రశ్నించారు. లక్షల కోట్ల బడ్జెట్ అంటారు, ప్రజలకు ఉపయోగం లేదు...ఇప్పటికి ముంపు గ్రామాల్లో విద్యుత్ సౌకర్యం లేదని మండిపడ్డారు. ఎన్నికల్లో మండలానికి ఒక శాసనసభ్యుడిని పంపారు కదా... మరి ముంపు గ్రామాల్లో ఎందుకు ఒక శాసన సభ్యులను పంపలేదని ప్రశ్నించారు. 

Advertisement
Advertisement