Abn logo
Apr 6 2020 @ 21:52PM

ఏమబ్బా.. ఏఏ20 అప్డేట్ ఎప్పుడొస్తాండాదో తెల్సా..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, సంచలన దర్శకుడు సుకుమార్ కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటున్న ‘ఏఏ20’ చిత్రానికి సంబంధించిన అప్‌డేట్‌ ఎప్పుడో చిత్రయూనిట్ తెలియజేసింది. మైత్రీ మూవీ మేకర్స్ అఫీషియల్ ట్విట్టర్ ద్వారా ఈ చిత్ర అప్‌డేట్‌ను అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఏప్రిల్ 8న ఉదయం 9గంటలకు విడుదల చేస్తున్నట్లుగా చెబుతూ ఓ పోస్టర్‌ను విడుదల చేశారు. అయితే ఇందులో ఏముంది.. నార్మల్ పోస్టరేగా అని అందరూ అనుకోవచ్చు. కానీ విడుదల చేసిన పోస్టర్ మాములుగా లేదు. ఈ చిత్రం ఏ తరహాలో ఉండబోతుందో చెప్పేంతగా.. రాయలసీమ స్లాంగ్‌లో అప్‌డేట్ గురించి బన్నీనే చెబుతున్నట్లుగా ఉండటం విశేషం. ఈ పోస్టర్‌ను ట్వీట్ చేసిన మైత్రీ మూవీ మేకర్స్.. ఏప్రిల్ 8న ఉదయం 9గంటలకు ‘ఇంక చూస్కో నా సామి..’’ అని కూడా పేర్కొన్నారు. అంటే అప్‌డేట్ మాములుగా ఉండదన్నమాట.ఇక పోస్టర్‌లో ఉన్న మ్యాటర్ విషయానికి వస్తే.. ‘‘ఏమబ్బా.. అందరూ బాగుండారా.. మీరు ఎప్పుడెప్పుడా అని చూస్తాండే ఏఏ 20 అప్‌డేట్.. ఏప్రిల్ 8న, తెల్లార్తో 9గంటలకు వస్తాండాది. రెడీ కాండబ్బా..’’ అంటూ రాయలసీమ స్లాంగ్‌లో ఉంది. అంటే మొదటి నుంచి అనుకుంటున్నట్లుగానే రాయలసీమ నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కనుందనేది ఈ స్లాంగ్ చూస్తాంటే అర్థమవుతాంది. సో.. మొత్తానికి పుట్టినరోజున బన్నీ..తన ఫ్యాన్స్ కోసం భారీగానే ప్లాన్ చేసినట్లు మాత్రం తెలుస్తాంది.Advertisement
Advertisement
Advertisement