Abn logo
May 23 2020 @ 14:18PM

సీఎం జగన్‌కు మైసూరారెడ్డి లేఖ

అమరావతి: గ్రేటర్ రాయలసీమ ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు చేస్తూ చట్ట భద్రత కల్పించమని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి సీనియర్ నాయకులు మైసూరా రెడ్డి లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత శ్రీశైలం జూరాల నాగార్జునసాగర్ జలాశయాలు, అంతర్రాష్ట్ర జలాశయాలుగా మారినవని పేర్కొన్నారు.


గాలేరు-నగరి హంద్రీనీవా వెలిగొండ తెలుగుగంగ ప్రాజెక్టు కింద ఉన్న జలాశయాల, ప్రధాన కాలువ  పనులు మొదటగా పూర్తి చేయాలన్నారు. అప్పుడే రాయలసీమకు న్యాయం చేసిన వారమవుతామన్నారు. తర్వాత పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంచడం గురించి ఆలోచించాలని సూచించారు. రాయలసీమకు నీటి కేటాయింపుల్లో అన్యాయం జరిగితే ప్రత్యేక రాయలసీమ ఉద్యమాన్ని చేపడతామని మైసూరారెడ్డి తెలిపారు.