Abn logo
Mar 1 2021 @ 01:55AM

నా పేరే సారంగ దరియా!!

వినగానే గుర్తుండిపోయి, తెలియకుండానే పాడుకునే మాయాజాలం జానపద గీతాల సొంతం. అలాంటి ఓ పాటను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు శేఖర్‌ కమ్ముల. ఆయన దర్శకత్వంలో నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తున్న ‘లవ్‌ స్టోరి’ చిత్రంలోని ‘సారంగ దరియా’ పాటను ఆదివారం సమంత విడుదల చేశారు. సంగీత దర్శకుడు పవన్‌ సీహెచ్‌ ఫోక్‌ బీట్‌ అందించిన ఈ పాటకు సుద్దాల అశోక్‌ తేజ సాహిత్యం అందించారు. మంగ్లీ ఆలపించారు. శేఖర్‌ కమ్ముల మాట్లాడుతూ ‘‘తెలంగాణ జానపద గీతం ‘సారంగ దరియా’కి సరికొత్త సొగసులు అద్ది, తనదైన ముద్రతో సుద్దాల అశోక్‌తేజ చక్కని సాహిత్యం అందించారు. ఫోక్‌ బీట్‌కు మంగ్లీ లాంటి సింగర్‌ వాయిస్‌, శేఖర్‌ మాస్టర్‌ కొరియోగ్రఫీ కలిస్తే తెరపై సందడే సందడి. అలాంటి చక్కని పాట ఇది. ఈ పాటను ేసకరించి మాకు అందించిన రేలారే ‘కోమల’కు కృతజ్ఞతలు’’ అని తెలిపారు. కె నారాయణదాస్‌ నారంగ్‌, పి.రామ్మోహన్‌ రావు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్‌ 16న విడుదల కానుంది. 


Advertisement
Advertisement
Advertisement