Abn logo
Aug 3 2021 @ 23:07PM

సమగ్రాభివృద్ధికి సమన్వయంతో పనిచేయాలి

పులివెందులలో మెడికల్‌ కళాశాల నిర్మాణ పనులను పరిశీలిస్తున్న కలెక్టర్‌ విజయరామరాజు

పులివెందుల నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించిన కలెక్టర్‌

పులివెందుల, ఆగస్టు 3: జిల్లా అన్ని రంగాల్లో సమగ్ర అభివృద్ధి చెందాలంటే అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్‌ విజయరామరాజు పేర్కొన్నారు. మంగళవారం పులివెందుల నియో జకవర్గంలో జరుగుతు న్న అభివృద్ధి పనులను ఆయన పరిశీలిం చా రు. ఉదయం 11గంటల నుంచి సాయంత్రం 7వరకు పులివెందుల నియోజ కవర్గం లో పర్యటించారు. అభివృద్ధి పనుల పరిశీలన అనంతరం సాయంత్రం ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో అన్ని శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వ హించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. జిల్లాలో కరోనా మహమ్మారి విజృంభించకుండా మాస్కు తప్పనిసరిగా ధరించాల న్నారు. దిశ యాప్‌పై ప్రజలకు అవగా హన కలిగించాలన్నారు. అనంతరం ఆయన పులివెందుల నియో జక వర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు.  పులివెందులలో రూ.500 కోట్లతో నిర్మిస్తున్న మెడికల్‌ కళాశాలను, నూతనంగా నిర్మిస్తున్న ఆర్టీసీ బస్టాండ్‌ను, ఏపీకార్ల్‌ భవనాలను పరిశీలించారు. అక్కడి అధికారులు, కాంట్రాక్టర్లతో మాట్లాడారు. పనుల్లో వేగం పెంచాలన్నారు. పులివెందుల మోడల్‌ టౌన్‌ పనులపైన ఆయన చర్చించామన్నారు. తాగునీరు, ల్యాండ్‌ అక్విజిషన్‌, భూ రీసర్వే తదితర అంశాలపై చర్చించారు. ముఖ్యంగా ఆదాయం చేకూరే పనులపైనే అధికారులు దృష్టి సారించాలన్నారు. ఈ కార్యక్ర మంలో జేసీ సాయికాంత్‌వర్మ, పాడా ఓఎస్డీ అనిల్‌ కుమార్‌రెడ్డి, ఆర్డీఓ శ్రీనివాసులు, తహసీల్దార్‌ మాధవకృ ష్ణారెడ్డి, తాగు, సాగునీటి అధికా రులు, సీసీఎల్‌ అదికారులు, మున్సిపల్‌ కమిషనర్‌ నరసింహారెడ్డి పాల్గొన్నారు. 


మాస్టర్‌ ప్లాన్‌ను పరిశీలించిన కలెక్టర్‌

చక్రాయపేట, ఆగస్టు 3: గండి వీరాంజనేయస్వామి దేవస్థాన మాస్టర్‌ ప్లాన్‌ను మం గళవారం కలెక్టర్‌ విజయరామరాజు పరిశీలించారు. తొలుత ఆంజనేయస్వామి దర్శ నానికి వెళ్లిన ఆయనకు ఆలయ సహాయ కమిషనర్‌ అలవలపాటి ముకుందరెడ్డి, ఉప అర్చకులు రాజారమేష్‌, స్వాములు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికి శాలు వలు కప్పి ఘనంగా సత్కరించారు. దేవస్థానం అభివృద్ధికి ముఖ్యమంత్రి రూ.14.50 కోట్ల నిధులు మంజూరు చేయడంతో ఆయా పనులను పరిశీలించారు. జేసీ సా యికాంత్‌వర్మ, పాడా ఓఎస్డీ అనిల్‌కుమార్‌రెడ్డి, జమ్మల మడుగు ఆర్డీఓ శ్రీనివాసులు, దేవాదాయ శాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌ శంకర బాలాజి పాల్గొన్నారు.