Abn logo
Sep 17 2021 @ 00:10AM

సేవా కార్యక్రమాల్లో ముందుండాలి

రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన మాగుంట

ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి 


ఒంగోలు(కలెక్టరేట్‌), సెప్టెంబరు 16: సమాజా నికి ఉపయోగపడే సేవా కార్యక్రమాల్లో ముందుం డాలని ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి పేర్కొ న్నారు. గురువారం ఒం గోలులోని అంబేడ్కర్‌భవన్‌లో జీఎంఆర్‌ వెల్ఫేర్‌ సొసైటీ ఆధ్వర్యం లో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాగుంట మాట్లాడుతూ సొసైటీకి గౌరవాధ్యక్షులుగా ఉన్న బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌ జన్మదినం పు రస్కరించుకుని రక్తదాన శిబిరం ఏర్పాటు చేయటం అభినందనీ యమన్నారు. ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు ఐవీ.సుబ్బారావు మాట్లాడుతూ సత్యకుమార్‌ తగిన చొరవ చూపి జర్నలిస్టులను ఫ్ర ంట్‌లైన్‌ వారియర్స్‌గా గుర్తించేలా కృషి చేయాలని కోరారు. అనంత రం ఐవీ.సుబ్బారావు, రిమ్స్‌ డిప్యూటీ సూపరింటెండెంట్‌ మురళి కృష్టారెడ్డి, డాక్టర్‌ చాపల వంశీకృష్ణ, డాక్టర్‌ రిచర్డ్స్‌,  వినోదరాయుని పాలెం హెచ్‌ఎం రమేష్‌, ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్‌ సంగీతలక్ష్మిలను ఎంపీ మాగుంట మీదుగా ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో సొసైటీ జిల్లా కన్వీనర్‌ పిల్లి రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.