Abn logo
Sep 22 2020 @ 01:44AM

ప్రభాస్‌ చిత్రంలో సింగీతం కొత్త రోల్‌

Kaakateeya

ప్రభాస్‌ కథానాయకుడిగా నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందనున్న సంగతి తెలిసిందే. దీనికి స్ర్కిప్ట్‌ మార్గదర్శిగా సింగీతం శ్రీనివాసరావు వ్యవహరించనున్నారు. ‘‘ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న కల నిజమైంది. చరిత్రలో నిలిచిపోయే మా చిత్ర బృందంలోకి స్ర్కిప్ట్‌ మార్గదర్శిగా సింగీతం శ్రీనివాసరావుగారిని స్వాగతిస్తున్నందుకు మేం ఎంతో సంతోషిస్తున్నాం. ఆయన సృజనాత్మక శక్తులు మాకు కచ్చితంగా మార్గదర్శకంగా ఉంటాయి’’ అని చిత్రనిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్‌ తెలియజేసింది. సైన్స్‌ ఫిక్షన్‌ నేపథ్యంలో ఈ చిత్రం రూపొందుతోంది. గతంలో సింగీతం శ్రీనివాసరావు ‘ఆదిత్య 369’ అనే సైన్స్‌-ఫిక్షన్‌ చిత్రానికి దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. కొన్ని నెలలుగా ఆయన ఈ చిత్ర పనులు చేస్తున్నారని వైజయంతీ మూవీస్‌ తెలిపింది. ప్రభాస్‌ సరసన హిందీ కథానాయిక దీపికా పడుకోన్‌ నటించనున్న ఈ చిత్రాన్ని సి. అశ్వినీదత్‌ నిర్మాత. భారీ నిర్మాణ వ్యయం, దేశవ్యాప్తంగా పేరు పొందిన తారాగణం, సాంకేతిక నిపుణులతో చిత్రాన్ని నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నామని ఆయన తెలిపారు.

‘చిత్రజ్యోతి’లో మరిన్ని ఆసక్తికర 

కథనాల కోసం ఈ క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేయండి. లేదా ఈ క్రింది యూఆర్‌ఎల్‌   

https://qrgo.page.link/63bVqలో చదవండి.

Advertisement
Advertisement
Advertisement