Abn logo
Sep 20 2021 @ 23:26PM

వీరిశెట్టిగూడెంలో హత్య

మృతదేహాన్ని పరిశీలిస్తున్న ఎస్‌ఐ

విచారణ చేపట్టిన పోలీసులు.. నిందితుల కోసం గాలింపు


కామవరపుకోట, సెప్టెంబరు 20: మండలంలోని వీరిశెట్టిగూడెంలో సోమవారం తెల్లవారుజామున పెనుమాల నాగరాజు (38) హత్య సంఘటన సంచలనం కలిగించింది. నాటుకోళ్లు విక్రయించే నాగరాజును గుర్తు తెలియని వ్యక్తులు కత్తితో పొడిచి చంపినట్లు తెలుస్తోంది. మృతుడి శరీరంపై కత్తిపోట్లను బట్టి హత్యకు గురైనట్లు పోలీ సులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు.  నాగరాజు ద్విచక్ర వాహనంపై ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఇంటికి వస్తుం డగా గుర్తు తెలియని వ్యక్తులు దారికాచి పొడిచి చంపి ఉంటారని పోలీసులు భావి స్తున్నారు. హత్య సంఘటనపై సమాచారం అందుకున్న జంగారెడ్డిగూడెం డీఎస్పీ బి.రవికిరణ్‌, చింతలపూడి సీఐ ఎంవీఎస్‌. మల్లేశ్వరరావు, తడికలపూడి ఎస్‌ఐ కె.వెంకన్న సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకున్నారు. డాగ్‌ స్క్వాడ్‌, క్లూస్‌ టీమ్‌తో ఆధారాలు సేకరించారు. హత్య కేసుగా నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కాగా మృతుడు నాగరాజుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.