Advertisement
Advertisement
Abn logo
Advertisement

కుమారుడి చేతిలో తల్లి హతం

మద్యానికి డబ్బులు ఇవ్వలేదని వల్లూరులో దారుణం 

కాకుమాను, డిసెంబరు 2: మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వలేదని కుమారుడు తల్లిని కడతేర్చిన సంఘటన మండల పరిధిలోని వల్లూరులో బుధవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించి పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు.. వల్లూరుకు చెందిన ఈమని సీతామహాలక్ష్మి(65) భర్త చనిపోయినప్పటి నుంచి ఒంటరిగాఉంటుంది. మద్యానికి బానిసైన పెద్దకుమారుడు ప్రభాకర్‌రెడ్డి తరచూ డబ్బులు కోసం తల్లి వద్దకు వచ్చి వేధించేవాడు. ఈ క్రమంలో బుధవారం రాత్రి కూడా తల్లి వద్దకు వచ్చి డబ్బులు అడిగాడు. ఆమె తన వద్ద లేదన్నది. దీంతో  ప్రభాకర్‌రెడ్డి అక్కడే ఉన్న రోకలి బండతో తల్లిపై విచక్షణారహితంగా దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన సీతామహాలక్ష్మి అక్కడికక్కడే మృతి చెందింది. చిన్న కుమారుడు సుధాకర్‌రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ రవీంద్రబాబు తెలిపారు. సంఘటన స్థలాన్ని పొన్నూరు రూరల్‌ సీఐ అళహరి శ్రీనివాస్‌ గురువారం పరిశీలించారు.  


Advertisement
Advertisement