Abn logo
Aug 7 2020 @ 03:09AM

వేధిస్తున్నాడని... భార్య, అత్త చంపేశారు!

ఇరగవరం, ఆగస్టు 6 : వేధింపులు తాళలేక భర్తను ఓ మహిళ తల్లితో కలిసి హత్యచేసింది. పశ్చిమగోదావరి జిల్లా ఇరగవరం మండలం అర్జునుడుపాలెంలో జరిగిన సంఘటనకు సంబంధించి వివరాలు... గ్రామానికి చెందిన వడ్డి కొండయ్య (35) రోజూ తాగివచ్చి  భార్య రామలక్ష్మిని హింసించేవాడు. ఆమె బుధవారం రాత్రి అదేగ్రామంలోని పుట్టింటికి వెళ్లింది. యథావిధిగా తాగొచ్చిన కొండయ్య రాత్రి పదకొండు గంటలకు అత్తగారింటికి వెళ్లి భార్యతో గొడవ పడుతుండగా అత్త చెన్నవరపు పార్వతి కలుగుజేసుకుని సర్దిచెప్పబోయింది. దీంతో అతను రెచ్చిపోయి ఘర్షణకు దిగడంతో భార్య, అత్తగారు అతని మెడకు చీరను గట్టిగా బిగించి లాగడంతో మృతి చెందాడు. సమాచారం అందుకున్న పెనుగొండ సీఐ సునీల్‌ కుమార్‌, ఇరగవరం ఎస్‌ఐ జె.సతీశ్‌ ఘటనా స్థలికి చేరుకుని వివరాలను సేకరించారు.  

Advertisement
Advertisement
Advertisement