Abn logo
Jul 31 2021 @ 01:03AM

మున్సిపాలిటీ సమగ్రాభివృద్ధే లక్ష్యం: ఎమ్మెల్యే

మున్సిపల్‌ రెండో వై్‌సచైర్మన పూజారి తిమ్మప్పకు డిక్లరేషన ఫారం అందజేస్తున్న ప్రత్యేకాధికారి శివయ్య

కళ్యాణదుర్గం, జూలై 30: మున్సిపాలిటీని సమగ్రాభివృద్ధి చే యడమే లక్ష్యమని ఎమ్మెల్యే ఉషాశ్రీచరణ్‌ పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక మున్సిపల్‌ కార్యాలయంలో రెండవ మున్సిపల్‌ వైస్‌ చైర్మన, కో-ఆప్షన మెంబర్ల ఎన్నికను స్పెషల్‌ ఆఫీసర్‌ శివయ్య అధ్యక్షతన ని ర్వహించారు. ఉదయం 11 గంటలకు ఎమ్మెల్యేతో పాటు కౌన్సిల్‌ స భ్యులు హాజరయ్యారు. వైస్‌ చైర్మన, కో-ఆప్షనమెంబర్ల ఎన్నికకకు  కౌన్సిలర్లు ప్రతిపాదించారు. వైస్‌ చైర్మనగా పూజారి తిమ్మప్ప, కో-ఆప్షనసభ్యులుగా షేక్‌ అప్జల్‌, చల్లా మారుతి, యాస్మినబానులను ఏకగ్రీవంగా ఎనుకున్నారు. వైస్‌ చైర్మనకు ప్రత్యేక అధికారి శివయ్య డిక్లరేషన పత్రాన్ని అందజేశారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మున్సిపాలిటీ పరిధిలో నెలకొన్న సమస్యలను గుర్తించి సత్వరమే పరిష్కరించాలని అధికారులకు సూచించారు. చైర్మన, వైస్‌ చైర్మన్లు, కౌన్సిలర్లు వార్డుల్లో పర్యటించి ప్రజా సమస్యలపై దృష్టి సారించాలన్నారు. ముఖ్యంగా తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందుజాగ్రత్త చర్యలు చేపట్టాలన్నారు. అనివార్య కారణాల వల్ల నీటి సరఫరాలో అంతరా యం ఏర్పడితే ప్రజలకు అవసరం మేర ట్యాంకర్లతో నీటిని అందించి  దాహార్తి తీర్చాలని ఆదేశించారు. దీంతో పాటు సీసీరోడ్లు, డ్రైనేజీలు, పారిశుధ్యం పనులు చేపట్టాలన్నారు.


టీడీపీ హయాంలో ఎల్‌ఈడీ వీధిలైట్ల ఏర్పాటులో అవినీతి, అక్రమాలు చోటుచేసుకున్నాయని ఎమ్మెల్యే ఆరోపించారు. దీనిపై సమగ్ర విచారణ చేపట్టేందుకు ప్రత్యేక బృం దాన్ని ఏర్పాటు చేశామన్నారు. అనంతరం ఏకగ్రీవంగా ఎన్నికైన వైస్‌ చైర్మన తిమ్మప్ప, కో-ఆప్షన సభ్యులను ఎమ్మెల్యే అభినందించారు. తో టి సభ్యులు పూలమాలలతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశా రు. కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ వెంకటరాముడు, డీఈ హే మచందర్‌, చైర్మన తలారి రాజ్‌కుమార్‌, వైస్‌ చైర్మన జయం ఫణీంద్ర, కౌన్సిలర్లు పాల్గొన్నారు.