Abn logo
Sep 21 2021 @ 23:28PM

మునిసిపల్‌ కార్మికుల నిరసన

నిరసన తెలుపుతున్న కార్మికులు

కాశీబుగ్గ: మునిసిపల్‌ కార్మికులు తమ సమస్యల పరిష్కారానికి నిరసన కొనసాగిస్తున్నారు. మంగళవారం రెండోరోజు కూడా విధులకు హాజరుకాలేదు. ఈసందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి గణపతి మాట్లాడుతూ రూ.33,52,000 పీఎఫ్‌ సొమ్ము కార్మి కుల ఖాతాల్లో జమ చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ విషయమై  చైర్మన్‌ గిరిబాబు కార్మికులతో చర్చించారు. సమస్యలు పరిష్కార మయ్యే వరకు విధులకు హాజరుకాబోమని కార్మికులు తేల్చి చెప్పారు. కార్యక్రమంలో యూనియన్‌ అధ్యక్షుడు మురుగన్‌, కార్మికులు రవి, ప్రకాష్‌,  శకుంతల, సీతమ్మ పాల్గొన్నారు.