Abn logo
Oct 11 2020 @ 05:41AM

మత్స్యకారుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి

మేడ్చల్‌: మత్స్యకారుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోందని ఎంపీపీ పద్మజగన్‌రెడ్డి, మేడ్చల్‌ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ మర్రి దీపిక నర్సింహారెడ్డిలు అన్నారు. శనివారం మేడ్చల్‌ మత్సశాఖ కార్యాలయంలో మత్స్యకారులకు చేపపిల్లలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఉచితంగా చేప పిల్లలను పంపిణీ చేస్తోందన్నారు. అలాగే వాహనాలు, పరికరాలనూ అందిస్తున్నదన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను మత్స్యకారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. శ్రీరంగవరం, గర్మిపూర్‌ మేడ్చల్‌లోని చెరువుల్లో చేపపిల్లలను వదిలారు. కార్యక్రమంలో మాజీ సర్పంచులు నరేందర్‌రెడ్డి, జగన్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ పార్టీ మేడ్చల్‌ మున్సిపల్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మాధవరెడ్డి, నాయకులు నాగరాజు పాల్గొన్నారు. 

Advertisement
Advertisement