Abn logo
Oct 24 2020 @ 10:19AM

కుమార్తెను పెన్సిలుతో పొడిచిన తల్లి

Kaakateeya

ఆన్‌లైన్ క్లాసులో టీచరుకు  సమాధానం చెప్పలేదని...

ముంబై (మహారాష్ట్ర): ఆన్‌లైన్ క్లాసులో టీచరుకు  సమాధానం చెప్పలేదనే కోపంతో 12 ఏళ్ల వయసుగల కుమార్తెను పెన్సిలుతో పొడిచిన తల్లి బాగోతం మహారాష్ట్రలోని ముంబై నగరంలో వెలుగుచూసింది.తన 12 ఏళ్ల వయసున్న కుమార్తె ఆన్ లైన్ క్లాసులో టీచరు ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోయిందనే కోపంతో తల్లి ఆమెను పెన్సిలుతో పొడిచింది. 6 వతరగతి చదువుతున్న కుమార్తె టీచర్ ప్రశ్నలకు సరిగా సమాధానాలు ఇవ్వలేదని ఆగ్రహించిన తల్లి ఆమెను పెన్సిలుతో పలుసార్లు పొడచింది. ఇదంతా చూసిన పెద్ద కుమార్తె 1098 ఛైల్డ్ హెల్ప్ లైన్ నంబరుకు ఫోన్ చేసి ఫిర్యాదు చేసింది. తల్లిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బాలికకు చికిత్స చేయించారు. కుమార్తెను పెన్సిలుతో పొడిచిన తల్లిని పోలీసులు ఇంకా అరెస్టు చేయలేదు.

Advertisement
Advertisement