Abn logo
Jul 13 2020 @ 13:03PM

పోలీసులకు రోహిత్ శెట్టి సాయం.. థాంక్స్ చెప్పిన కమీషనర్

బాలీవుడ్ డైరెక్ట‌ర్ రోహిత్ శెట్టి క‌మ‌ర్షియ‌ల్ డైరెక్టర్‌గా త‌న‌కంటూ ఓ ఇమేజ్‌ను సంపాదించుకున్నారు. పోలీసుల‌ను ప‌వ‌ర్‌ఫుల్‌గా చూపించిన ద‌క్షిణాది చిత్రాలు సింగం, సింబా వంటి చిత్రాలను హిందీలో రీమేక్ చేసిన సంగ‌తి తెలిసిందే. సినిమాల్లో పోలీసుల గొప్ప‌త‌నాన్ని గొప్ప‌గా చూపించిన రోహిత్ శెట్టి.. ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో పోలీసులు ప్ర‌జ‌ల కోసం ఎంత క‌ష్ట‌ప‌డుతున్నారో గుర్తెరిగి వారికి త‌న వంతు సాయాన్ని అందించ‌డానికి ముందుకు వ‌చ్చారు. అందులో భాగంగా విధుల్లోని పోలీసులు విశ్రాంతి తీసుకోవ‌డానికి, భోజ‌న వ‌స‌తిని క‌ల్పించారు. అందుకోసం 11 హోటళ్ల‌ను రోహిత్ శెట్టి సిద్ధం చేశారు. 100 రోజుల పాటు ఈ హోటల్స్ పోలీసులకు వసతులను అందజేస్తాయి. రోహిత్ శెట్టి పోలీసుల‌కు చేస్తున్న సపోర్ట్‌కి ముంబై పోలీస్ క‌మీష‌న‌ర్ ప‌ర‌మ్ బీర్ సింగ్ ట్విట్ట‌ర్ ద్వారా కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. 

Advertisement
Advertisement
Advertisement