Abn logo
Jul 12 2020 @ 08:52AM

క‌రోనాతో బీఎంసీ అసిస్టెంట్ క‌మిష‌న‌ర్ మృతి

ముంబై: బృహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ (బీఎంసీ)లో అసిస్టెంట్ క‌మిష‌న‌ర్‌గా ప‌నిచేస్తున్న‌ అశోక్ ఖైర్నార్(57) కరోనా బారిన‌ప‌డి మృతి చెందారు. ముంబైలో క‌రోనాపై జ‌రుగుతున్న పోరాటంలో అశోక్ ముఖ్యమైన పాత్ర పోషించారు. ములుంద్‌లోని ఫోర్టిస్ ఆసుపత్రిలో ఆయన క‌న్నుమూశారు. కాగా ఇప్పటివరకు 100 మందికి పైగా బీఎంసీ ఉద్యోగులు కరోనా బారిన‌ప‌డి మృతిచెందారు. రెండు వేలకుపైగా సిబ్బంది ఈ వ్యాధి బారిన పడ్డారు. అసిస్టెంట్ మునిసిపల్ కమిషనర్ ఫోర్టిస్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ, తుది శ్వాస విడిచారు. అత‌నికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఖైర్నర్ ఫిబ్రవరి 1988 నుంచి ముంబై మునిసిపల్ కార్పొరేషన్‌లో ఉద్యోగం చేస్తున్నారు. 2018 జ‌న‌వ‌రిలో ఆయన అసిస్టెంట్ కమిషనర్‌గా నియమితుల‌య్యారు. డిపార్ట్‌మెంట్‌లో ఖైర్నర్ చేసిన కృషికి గుర్తింపుగా ఆయనకు గత ఏడాది జనవరిలో ఆఫీసర్ ఆఫ్ ది మంత్‌గా గుర్తించి, స‌న్మానం చేశారు. తరువాత ఆయన కార్పొరేషన్‌లో అసిస్టెంట్ కమిషనర్‌గా బాధ్య‌త‌లు చేప‌ట్టారు. 

Advertisement
Advertisement
Advertisement