Abn logo
Oct 23 2020 @ 07:52AM

సినీ ఫక్కీలో బాబు కిడ్నాప్... పట్టుకున్న స్థానికులు

ములుగు: జిల్లాలోని వెంకటాపురం మండలం సీనీఫక్కీలో నాలుగు నెలల బాబు కిడ్నాప్‌కు గురయ్యాడు. అదే తరహాలో స్థానికులు కూడా కిడ్నాపర్లను చేజ్ చేసి పట్టుకున్నారు. అనంతరం వాహనాన్ని, కిడ్నాపర్లను, బాలుడిని పోలీసులకు అప్పగించారు. నాలుగు నెలలక్రితం నాగేశ్వరీ అనే మహిళ బాలుడిని దత్తత తీసుకుంది. అయితే దత్తత ఇచ్చినవారే ఈపని చేసి ఉంటారని పోలీసులకు బాధితురాలి ఫిర్యాదు చేసింది. ప్రేమ పెళ్లి చేసుకుని ఇంట్లో వారు కాదనడంతో 7నెలల గర్భిణిగా నాగేశ్వరిని  స్నేహ-మహేందర్ దంపతులు ఆశ్రయించారు. కాన్పు చేసిన నాగేశ్వరీ బాలుడిని తల్లిదండ్రులు వద్దనడంతో దత్తత తీసుకుంది. ఈక్రమంలో గత అర్ధరాత్రి తనపై దాడి చేసి, కళ్లలో కారం చల్లిన దుండగులు బాలుడిని ఎత్తుకెళ్లినట్లు బాధితురాలు నాగేశ్వరి పోలీసులకు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

Advertisement
Advertisement