Abn logo
Sep 20 2020 @ 03:42AM

అజరెంకాకు ముగురుజా షాక్‌

Kaakateeya

ఇటాలియన్‌ ఓపెన్‌ సెమీస్‌లో జకోవిచ్‌, హలెప్‌


రోమ్‌: టైటిల్‌ ఫేవరెట్లలో ఒకరిగా బరిలోకి దిగిన యూఎస్‌ ఓపెన్‌ ఫైనలిస్టు విక్టోరియా అజరెంకాకు వరల్డ్‌ మాజీ నెంబర్‌ వన్‌ గార్బినె ముగురుజా షాకిచ్చింది. శనివారం జరిగిన ఇటాలియన్‌ ఓపెన్‌ మహిళల సింగిల్స్‌ క్వార్టర్స్‌ పోరులో 9వ సీడ్‌ ముగురుజా (స్పెయిన్‌) 3-6, 6-3, 6-4తో అజరెంకా (బెలారస్‌)పై విజయం సాధించి సెమీస్‌ బెర్త్‌ ఖాయం చేసుకుంది. మరో క్వార్టర్స్‌ పోరులో యులియా పుటింట్సేవాతో తలపడిన వెటరన్‌ క్రీడాకారిణి సిమోనా హలెప్‌కు వాకోవర్‌ లభించడంతో సెమీస్‌లో ప్రవేశించింది. ఈ మ్యాచ్‌లో హలెప్‌ తొలి సెట్‌ను 6-2తో కైవసం చేసుకోగా, రెండో సెట్‌లో 2-0తో ఆధిక్యంలో ఉన్న సమయంలో యులియా వాకోవర్‌ ఇచ్చింది. పురుషుల సింగిల్స్‌లో సెర్బియా యోధుడు నొవాక్‌ జొకోవిచ్‌ వరుసగా 15వసారి ఇటాలియన్‌ ఓపెన్‌ సెమీస్‌లో అడుగుపెట్టాడు. క్వార్టర్స్‌లో జొకో 6-3, 4-6, 6-3తో డొమినిక్‌ కోఫెర్‌పై చెమటోడ్చి నెగ్గాడు. 

Advertisement
Advertisement
Advertisement