Abn logo
Dec 2 2020 @ 00:52AM

ముగిసిన పుష్కరాలు

  1.  విధుల్లో అందరి కృషి అభినందనీయం 
  2.   ప్రశంసాపత్రాలు అందించిన ఎస్పీ


కర్నూలు, డిసెంబరు 1: గత నెల 20 నుంచి మొదలైన తుంగభధ్ర పుష్కరాలు మంగళవారంతో దిగ్విజయంగా ముగిసాయి. ఈ పుష్కరాలు ప్రశాంతంగా ముగియడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.  ఈ సందర్భంగా విధుల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరి కృషిని  అభినందించేందుకు   జిల్లా పోలీస్‌ కార్యాలయంలోని పరేడ్‌ మైదానంలో అభినందన సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ ఫక్కీరప్ప మాట్లాడుతూ   పుష్కరాల విజయవంతానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. పారిశుధ్య సిబ్బంది, ట్రాఫిక్‌ కమ్యూనికేషన్‌, ఎస్‌డీఆర్‌ఎఫ్‌, పోలీసు బృందాలు, ఏపీఎ్‌సపీ బలగాలు, జిల్లా పోలీస్‌ యంత్రాంగం బాగా పని చేశారని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 23 పుష్కర ఘాట్లలో పోలీసు యంత్రాంగం, అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు, ఉద్యోగులు, స్వచ్ఛంద సంస్థల సేవకులు, వలంటీర్లు, ఇతర శాఖల సమన్వయంతో కలిసికట్టుగా విధులు నిర్వహించడంతోనే పుష్కరాలు విజయవంతంగా ముగిసాయన్నారు. రాష్ట్ర డీజీపీ ఆదేశాల మేరకు మూడు రోజులపాటు పుష్కరాల్లో  దివ్యాంగులకు, వృద్ధ్దులకు పుష్కరాల్లో  పాల్గొనే అవకాశం కల్పించామని తెలిపారు. విధులు నిర్వహిచిన వారికి ప్రశంసాపత్రాలు, వీఐపీ ట్రాలీ సూట్‌ కేసు, ట్రావెలింగ్‌ బ్యాగ్‌ అందజేశారు. ఎస్‌ఈబీ అడిషనల్‌ ఎస్పీ గౌతమిశాలి, ట్రైనీ ఐపీఎస్‌ అధికారి కొమ్మి ప్రతాప్‌ శివకిషోర్‌, సదరన్‌ రీజియన్‌ హోంగార్డు కమాండెంట్‌ రామ్మోహన్‌, అదనపు ఎస్పీలు మధుసూదన్‌రావు, రాధాకృష్ణ, అర్జున్‌, రామకృష్ణప్రసాద్‌, రుషికేశవరెడ్డి, హనుమంతు, రాజశ్రీ, డీఎస్పీలు బీ.రమణ, వెంకటాద్రి, వెంకట్రామయ్య పాల్గొన్నారు.

Advertisement
Advertisement
Advertisement