Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఉభయ రాష్ట్రాల సీఎంలకు కాపు ఉద్యమనేత ముద్రగడ లేఖ

కాకినాడ: ఉభయ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం లేఖ రాశారు. తడిచిన ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని పిలుపునిచ్చారు. పాడైన ధాన్యం నుంచి ఆర్ఎస్ స్పిరిట్ తయారు చేసే పరిశోధనలు చేయించాలని సూచించారు. పరిశోధనలు ఫలిస్తే జిల్లాకొక స్పిరిట్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తే బాగుంటుందని లేఖలో ప్రస్తావించారు. తద్వారా ధాన్యానికి మద్దతు సమస్య ఉండదన్నారు. నిత్యం నీరు ఉండే పొలాల్లో వరి తప్పించి వేరే పంట కష్టమని ముద్రగడ పేర్కొన్నారు.

Advertisement
Advertisement