Abn logo
Feb 28 2021 @ 17:50PM

ఐపీఎల్ 2021.. దేవ్రీ ఆలయంలో ధోనీ పూజలు

రాంచీ: ఐపీఎల్ 2021కు ముందు టీమిండియా మాజీ సారథి మహేంద్రసింగ్ ధోనీ డియోరీ దేవీ ఆశీస్సులు అందుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు గతేడాది రిటైర్మెంట్ ప్రకటించిన ధోనీ కుటుంబంతో, స్నేహితులతో గడుపుతున్నాడు. ప్రస్తుతం సొంతపట్టణమైన రాంచీలో ఉంటున్న మాజీ కెప్టెన్ తరచూ మా డియోరీ ఆలయానికి వెళ్లి అమ్మవారిని దర్శించుకుంటూ ఉంటాడు. మెగా టోర్నీ ప్రారంభానికి ముందు తాజాగా తన చిన్ననాటి స్నేహితుడు సిమత్ లోహానీ (చిట్టు)తో కలిసి  ఆలయాన్ని సందర్శించి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశాడు. ధోనీ రాక సందర్భంగా ఆలయం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ధోనీని చూసేందుకు అభిమానులు పోటెత్తారు. సెల్పీల కోసం పోటీలు పడ్డారు.

అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించినప్పటికీ ముందుస్తు కమిట్‌మెంట్ల వల్ల దేశవాళీ టోర్నీలు సయ్యద్ ముస్తాక్ అలీ, విజయ్ హజారే ట్రోఫీలలో జార్ఖండ్ తరపున ధోనీ ఆడడం లేదు. అయితే, ఐపీఎల్‌లో మాత్రం చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే)కు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ధోనీ సారథ్యంలోని సీఎస్‌కే మూడుసార్లు విజేతగా నిలిచింది.

Advertisement
Advertisement
Advertisement