Abn logo
Sep 24 2021 @ 23:18PM

కొలువుదీరిన పరిషత్‌ పాలకవర్గాలు

ఎంపీపీ అల్లూరు అనిల్‌రెడ్డిని సత్కరిస్తున్నఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య

ఎంపీపీల ఎన్నిక ఎంపీటీసీల ప్రమాణ స్వీకారం ఎమ్మెల్యేలు, నేతల అభినందనలు

సూళ్లూరుపేట, సెప్టెంబరు 24 : సూళ్లూరుపేట ఎంపీపీగా అల్లూరు అనిల్‌రెడ్డి, ఉప మండలాధ్యక్షుడుగా బోడెం మంజుల ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎంపీపీ అనిల్‌రెడ్డి ప్రమాణస్వీకారం చేసి బాధ్యతలు స్వీకరించారు. ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, తహసీల్దారు రవికుమార్‌, వివిధశాఖల అధికారులు, తదితరులు ఎంపీపీ అనిల్‌రెడ్డి, ఇతర సభ్యులను శాలువాలతో సత్కరించారు. ఎంపీపీ అనిల్‌రెడ్డి మాట్లాడుతూ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటానని ఎమ్మెల్యే కిలివేటి సహకారంతో మండల అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. ఎంపీటీసీల ప్రమాణస్వీకారం, ఎంపీపీ ఎన్నిక ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, రిటర్నింగ్‌ అధికారి వెంకటయ్య, ఎంపీడీవో నర్మదల సమక్షంలో జరిగింది. ముందుగా సుకుమార్‌ను కోఆప్షన్‌ సభ్యుడిగా ఎన్నుకున్నారు. 

అల్లూరు అనిల్‌రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికై పదవి చేపట్టడంతో ఆయన అభిమానులు సంబరాలు చేసుకున్నారు. భారీగా బాణసంచా కాల్చారు. భారీ గజమాలలు, శాలువాలతో సత్కరించారు. అనిల్‌రెడ్డిని సత్కరించిన వారిలో మున్సిపల్‌ చైర్మన్‌ దబ్బల శ్రీమంత్‌రెడ్డి, వైస్‌ చైర్మన్‌ చిన్ని సత్యనారాయణ, డీసీఎంఎస్‌ మాజీ డైరెక్టర్‌ జెట్టి వేణుయాదవ్‌, కౌన్సిలర్‌ మీజూరు రామకృష్ణరెడ్డి, కళత్తూరు రామమోహన్‌రెడ్డి, వైసీపీ నాయకులు అల్లూరు రమేష్‌రెడ్డి, వి. కృపాకర్‌రెడ్డి, కొడూరు రాజశేఖర్‌, వీరాస్వామి, అలవల సురేష్‌, బద్దెపూడి మోహన్‌రెడ్డి, తాటిపర్తి శ్రీనివాసులురెడ్డి, వాసుమొదలి, స్వామిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

ఓజిలి :  ఎంపీపీగా భట్లకనుపూరు ఎంపీటీసీ గడ్డం అరుణమ్మ, వైస్‌ ఎంపీపీగా మానమాల ఎంపీటీసీ తుపాకుల మీనాక్షి, కో ఆప్షన్‌ సభ్యుడిగా ఎస్‌కె ఖాదర్‌బాషా   ఏకగీవ్రంగా ఎన్నికయ్యారు. స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో ఎన్నికల అధికారి వై.వి. శివారెడ్డి ఆధ్వర్యంలో ఎంపీడీవో టీ రమణయ్య ఎన్నికలను నిర్వహించారు. అంతకుముందు సభ్యులతో ప్రమాణం చేయించారు. ఎన్నికల అధికారులు వారికి ధృవపత్రాలను అందజేశారు. కురుగొండ ఎంపీటీసీ ముమ్మారెడ్డి ఇందిరమ్మ గైర్హాజరుకాగా మిగిలిన తొమ్మిది మందితో ఎన్నిక జరిగింది. కార్యక్రమంలో జడ్పీటీసీ గుంటమడుగు రవీంద్రరాజు పలువురు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఎంపీపీగా ఎన్నికైన గడ్డం అరుణమ్మను వైసీపీ నాయకులు  పూలమాలలు, శాలువాలలు వేసి అభినందించారు. 

తడ : తడ మండల పరిషత్‌ పాలకవర్గం ప్రమాణస్వీకారం అట్టహాసంగా జరిగింది. ఎంపీపీ అభ్యర్థిగా కొలవి రఘును వేనాడు ఎంపీటీసీ నదియా ప్రతిపాదించగా సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించి ఎన్నికున్నారు. ఉప మండలాధ్యక్షుడిగా గ్రద్దగుంట ఎంపీటీసీ వెంకటేష్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అనంతరం ప్రమాణస్వీకారం చేశారు. కోఆప్షన్‌ సభ్యుడిగా హుస్సేన్‌ ఎన్నిక ఏకగ్రీవమైంది. రిటర్నింగ్‌ అధికారి ఓంకార్‌రావు, ఎంపీడీవో శివయ్య ఆధ్వర్యంలో స్థానిక ఎంపీడీవో సమావేశ మందిరంలో 13 మంది ఎంపీటీసీలు ప్రమాణస్వీకారం చేశారు. ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, అధికారులు, ఏఎంసీ చైర్మన్‌ మారంరెడ్డి వెంకటకృష్ణారెడ్డి, సూళ్లూరుపేట మున్సిపల్‌ చైర్మన్‌ దబ్బల శ్రీమంత్‌రెడ్డి, డీసీఎంఎస్‌ డైరెక్టర్‌ గండవరం సురేష్‌రెడ్డి, వైసీపీ నాయకులు కళత్తూరు శేఖర్‌రెడ్డి, ఉచ్చూరు మునస్వామిరెడ్డి, రవిరెడ్డి, చంద్రారెడ్డి, సుందరరెడ్డి, శశికుమార్‌ తదితరులు ఎంపీపీ రఘును శాలువాలు, భారీ పూల మాలలతో సత్కరించారు.

నాయుడుపేట : స్థానిక మండల ప్రజా పరిషత్‌ కార్యా లయంలో ప్రిసైడింగ్‌ అధికారి జి. ఏడుకొండలు ఎంపీపీ, ఉపాధ్యక్ష, కోఆప్షన్‌ సభ్యుడి ఎన్నికను నిర్వహించారు. తొలుత ఎంపీటీసీలు ప్రమాణం చేశారు. పూడేరు ఎంపీటీసీ కురుగొండ ధనలక్ష్మి ఎంపీపీగా, భీమవరం ఎంపీటీసీ నెలవల మమత ఉప మండల ఉపాధ్యక్షురాలిగా,  కోఆప్షన్‌ సభ్యుడిగా షేక్‌. ఖాజాగరీబ్‌ ఎన్నికయ్యారు. వైసీపీ మండల కన్వీనర్‌ తంబిరెడ్డి సుబ్రహ్మణ్యంరెడ్డి అధ్యక్షతన ఎమ్మెల్యే, టీటీడీ బోర్డు సభ్యులు కిలివేటి సంజీవయ్య ముఖ్య అతిథిగా అభినందనసభ ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలందరికి సంక్షేమ, అభివృద్ధిలో  ప్రజా ప్రతినిధులు ప్రజారంజకపాలన అందించాలని కోరారు. కార్యక్రమంలో కామిరెడ్డి రాజారెడ్డి,  చైర్‌ పర్సన్‌ కటకం దీపిక, డీసీసీబీ మాజీ డైరెక్టర్‌ కలికి మాధవరెడ్డి, వైస్‌ చైర్మన్‌లు వెంకటకృష్ణారెడ్డి, షేక్‌ రఫీ, కిలివేటి యువసేన అధ్యక్షుడు పొట్లపూడి రాజేష్‌, కటకం జయరామయ్య, వైసీపీ ట్రైడ్‌ యూనియన్‌ రాష్ట్ర కార్యదర్శి కట్టా రమణారెడ్డి, సురేఖారెడ్డి, ఎఎంసీ చైర్మన్‌ రాధాకిషోర్‌యాదవ్‌, చదలవాడ కుమార్‌, చంద్రారెడ్డి, బలరామిరెడ్డి, దారా రవి, మఽధురెడ్డి పాల్గొన్నారు. 

రెండో సారీ దువ్వూరుకే

దొరవారిసత్రం, సెప్టెంబరు 24 : దొరవారిసత్రం మండల అధ్యక్ష పీఠం రెండోసారి దువ్వూరు సుజాతమ్మకే దక్కింది. ఆమె ఎంపీపీగా ఎన్నికై ప్రమాణ స్వీకారం చేశారు. ఆమె భర్త దువ్వూరు గోపాల్‌రెడ్డి వైస్‌ ఎంపీపీగా ఎన్నికయ్యారు. స్థానిక వైసీపీ నేత దువ్వూరు బాలచంద్రారెడ్డి కుటుంబ సభ్యులు కావడంతో  సుజాతమ్మకే రెండోసారి కూడాఎంపీపీ పదవిని కట్టబెట్టారు. ఎమ్మెల్యే సంజీవయ్య దువ్వూరు దంపతులను బాలచంద్రారెడ్డితో కలసి సత్కరించారు. కోఆప్షన్‌ సభ్యులుగా వేణుంబాక గ్రామానికి చెందిన షేక్‌ మౌలాను ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 10 మంది ఎంపీటీసీల చేత మండల ప్రత్యేకాధికారి  వేణుగోపాల్‌రెడ్డి, ఎంపీడీవో శింగయ్య ప్రమాణం చేయించారు. 

పెళ్లకూరు : పెళ్లకూరు ఎంపీపీగా నెలబల్లి ఎంపీటీసీ సభ్యుడు పోలంరెడ్డి శేఖర్‌రెడ్డి, ఉపాధ్యక్షులుగా తాళ్వాయిపాడు ఎంపీటీసీ సభ్యురాలు ఇలకా సుధారాణి, కోఆప్షన్‌ సభ్యులుగా పెళ్లకూరుకు చెందిన షేక్‌ దస్తగిరిసాహెబ్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.   ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి చైతన్యకుమార్‌, ఎంపీడీవో ప్రమీలారాణిలు ఎంపీటీసీలచేత  ప్రమాణస్వీకారం చేయించారు. రిటర్నింగ్‌ అధికారి ఎంపీపీ, ఉపాధ్యక్షులతో ప్రమాణస్వీకారం చేయించారు. అనంతరం ఎంపీపీ శేఖర్‌రెడ్డిని, ఉపాధ్యక్షురాలు సుధారాణిని  పలువురు వైసీపీ నాయకులు శాలువాలు కప్పి, గజమాలలతో సత్కరించారు.  కార్యక్రమానికి ఎమ్మెల్యే అనుచరులైన  వైసీపీ మండల కన్వీనర్‌ మారాబత్తిన సుధాకర్‌,  సీనియర్‌ నాయకులు చిందేపల్లి మధుసూదన్‌రెడ్డి, ఎస్‌. చైతన్యకృష్ణారెడ్డి, పేరం మధుసూధన్‌నాయుడులు డుమ్మాకొట్టడం చర్చనీయాంశమైంది. కార్యక్రమంలో ఎన్‌డీసీసీబీ చైర్మన్‌ కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి, మద్దాలి సోమశేఖర్‌రెడ్డి, బైనా మల్లికార్జున్‌రెడ్డి, అమరేంద్రరెడ్డి, మధునాయుడు, చెంగయ్య, మాతయ్య, వెంకటరత్నం, రామణారెడ్డి, రఘు, బాలాజీ, బాలసుబ్రహ్మణ్యం, జితేంద్ర పాల్గొన్నారు.