Abn logo
Oct 19 2021 @ 08:41AM

Minister అండతో అక్రమ నిర్మాణం.. కేటీఆర్‌కు MP Revanth ట్వీట్‌.. కూల్చివేత

హైదరాబాద్ సిటీ/ఉప్పల్‌ : ఉప్పల్‌ చౌరస్తాలో హైదరాబాద్‌కు చెందిన ఓ మంత్రి అండతో అక్రమ నిర్మాణం వెలుస్తున్నట్లు పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ట్విటర్‌ వేదికగా మంత్రి కేటీఆర్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన జీహెచ్‌ఎంసీ ఉప్పల్‌ సర్కిల్‌ అధికారులు అనుమతులు లేకుండా సెల్లార్‌ గుంతలో పిల్లర్లపై ఏర్పాటు చేస్తున్న సెంట్రింగ్‌ నిర్మాణాన్ని సోమవారం పూర్తిగా కూల్చివేశారు. ఉప్పల్‌ చౌరస్తాను ఆనుకొని వెలుస్తున్న అక్రమ నిర్మాణంపై ఎన్ని ఫిర్యాదులు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని మంత్రి కేటీఆర్‌కు ట్వీట్‌ చేస్తూ ‘మీ శాఖలో బాగోతాలు మీద చర్యలు ఉంటాయా..? లేదా మీరూ ఇందులో భాగస్వాములేనా..?’ అంటూ రేవంత్‌ ప్రశ్నించారు. నిర్మాణానికి సంబంధించిన ఫొటోతో సహా కేటీఆర్‌కు ఫిర్యాదు చేశారు. తెలంగాణ సీఎంఓ కార్యాలయానికి, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌కు కూడా టాగ్‌ చేశారు.


ఇవి కూడా చదవండిImage Caption

హైదరాబాద్మరిన్ని...