Advertisement
Advertisement
Abn logo
Advertisement
Nov 30 2021 @ 14:50PM

తెలంగాణ గ్రామీణ మంచినీటి ప్రాజెక్టులపై లోక్ సభలో ప్రశ్నించిన రంజిత్ రెడ్డి

న్యూఢిల్లీ: తెలంగాణలో గ్రామీణ మంచి నీటి సరఫరా కోసం ప్రాజెక్టుల మంజూరు పై కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఏమిటని సంబంధిత గ్రామీణభివృద్ది శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ ని చేవెళ్ళ లోక్ సభ సభ్యుడు డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డి లోక్ సభలో ప్రశ్నించారు.  సహచర లోక్ సభ సభ్యులు పసునూరి దయాకర్, వెంకటేష్ నేత, మాలోత్ కవిత లతో కలిసి లోక్ సభలో ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన ప్రశ్నించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ తీసుకుంటున్న చర్యలను సభ దృష్టి కి తీసుకెళ్లారు. మంచినీటి సరఫరా కోసం మిషన్ భగీరథ ద్వారా 100 శాతం గ్రామాలకు నల్లాల ద్వారా ఇంటింటికీ మంచినీరు అందిస్తున్నామన్నారు. పల్లె ప్రగతి పథకం ద్వారా గ్రామాల అభివృద్ధికి స్థానికంగానే ప్రజలు ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తున్నారన్నారు. 


గ్రామాల్లో డంపింగ్ యార్డులు, స్మశాన వాటికలు, పల్లె ప్రకృతి వనాలు, బృహత్ ప్రకృతి వనాలు, కల్లాలు, రైతు వేదికలు పూర్తి చేశామన్నారు. గ్రామ స్థాయిలో సర్పంచ్ లకే పూర్తి స్థాయి అభివృద్ధి అధికారాలు అప్పగించామని వివరించారు. ప్రజల భాగస్వామ్యంతో ఆయా పథకాలు అద్భుతంగా అమలు అవుతున్నాయని, గాంధీజీ చెప్పిన గ్రామ స్వరాజ్యాన్ని సీఎం కేసిఆర్ చేతల్లో అమలు చేసి చూపిస్తున్నారని ఎంపీ రంజిత్ రెడ్డి వివరించారు. ఈ - పంచాయతీ, ఆడిటింగ్ వంటి అంశాల్లో నూ తెలంగాణ దేశంలో అగ్రగామిగా ఉందని, రాష్ట్రంలో అనుసరిస్తున్న విధానాలను దేశ వ్యాప్తంగా అనుకరించాలని కూడా కేంద్రం దేశంలోని మిగతా రాష్ట్రాలకు సూచించిన విషయాన్ని ఎంపీ రంజిత్ గుర్తు చేశారు.


ఇదిలా ఉండగా కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి ఫుగ్గన్ సింగ్ కులస్తే తెలంగాణ ఎంపీ లకు రాత పూర్వకంగా సమాధానమిస్తూ ఇంతకముందు ఐడబ్ల్యూఎంపీ, డబ్ల్యూడిసి, పీఎంకేఎస్ వై పథకం కింద 276 వాటర్ షెడ్ ప్రాజెక్ట్ పథకాలను మంజూరు చేయగా అందులో 190 ప్రాజెక్టులు పూర్తి చేశామని మిగితావి 85 ప్రాజెక్టులు చివరి దశలో ఉన్నాయనీ, కోవిడ్ కారణంగా ఆగిపోయాయని వాటిని పూర్తి చేయడానికి ఇప్పటికే 67.26 కోట్లు మంజూరు చేశామని తెలిపారు. అట్లాగే జిల్లాల వారీగా 25 జిల్లాలో ప్రాజెక్టులు మంజూరు చేశామని వాటికి 85,617.22 కోట్లు మంజూరు చేశామని మంత్రి ఎంపీ రంజిత్ రెడ్డికి వివరించారు.

Advertisement
Advertisement