Abn logo
Jun 4 2020 @ 09:05AM

ఎంపీ రాజాను క్వారంటైన్‌కు పంపిన వైద్యులు

చెన్నై: డీఎంకే ఎంపీ ఎ.రాజాను క్వారంటైన్‌లో ఉంచినట్టు ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. లాక్‌డౌన్‌ 1.0 ప్రారంభం కాక ముందు జరిగిన పార్లమెంటు సమావేశాల్లో పాల్గొనేందుకు ఎంపీ రాజా ఢిల్లీకి వెళ్లారు. అనంతరం లాక్‌డౌన్‌ కారణంగా విమానాలు, రైళ్లు రద్దవడంతో ఆయన ఢిల్లీలోనే ఉండిపోయారు. ఈ నేపథ్యంలో లాక్‌డౌన్‌ నిబంధనల సడలింపుతో విమాన సేవలు ప్రారంభం కాగా మంగళవారం ఆయన విమానంలో ఢిల్లీ నుంచి కోయంబత్తూర్‌కు చేరుకున్నారు. విమానాశ్రయంలో వైద్యపరిశోధన అనంతరం ఎంపీ కారులో నీలగిరి జిల్లా ఊటీ హిల్‌బంక్‌ ప్రాంతంలో తన ఇంటికి వెళ్లారు. ఈ విషయం తెలుసుకున్న ఆరోగ్యశాఖ అధికారులు ఎంపీ ఇంటికి వెళ్లి థర్మల్‌ స్కానర్‌తో పరీక్షలు నిర్వహించి, ఏడు రోజులు క్వారంటైన్‌లో ఉండాలని సూచించారు. ఈ మేరకు ఎంపీ ఇంటికి అధికారులు స్టిక్కర్‌ను అంటించారు.

Advertisement
Advertisement
Advertisement