Advertisement
Advertisement
Abn logo
Advertisement

తెలంగాణలో కేసీఆర్ రైతులను ఆగం చేశారు: ఎంపీ అర్వింద్‌

న్యూఢిల్లీ: బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. తెలంగాణలో రైతులను సీఎం ఆగం చేశారని ఆరోపించారు. కేవలం వరి పంట వేయాలని రైతులను కోరారని, మార్క్‌ఫెడ్ సంస్థను నిర్వీర్యం చేశారన్నారు. మొక్కజొన్న కొనుగోలు మార్క్ ఫెడ్ సంస్థ కాకుండా.. దళారీలు కొనుగోలు చేసే పరిస్థితులు కల్పించారని విమర్శించారు. కేసీఆర్ కుటుంబం ఆధ్వర్యంలో జరిగే దళారుల కుంభకోణంపై.. దర్యాప్తు విషయంలో ఎఫ్‌సీఐ నిర్ణయం తీసుకుంటుందన్నారు. హుజురాబాద్‌లో టీఆర్ఎస్‌ను బీజేపీ ఓడించలేదని, ప్రజలే ఓడించారన్నారు. నల్గొండలో కేసీఆర్ డౌన్ డౌన్ అని రైతులే అంటున్నారని, బండి సంజయ్‌కు రైతులు ఘనస్వాగతం పలుకుతున్నారని అరవింద్ అన్నారు.

Advertisement
Advertisement