Advertisement

డిసెంబర్‌లో విడుదలయ్యే సినిమాలు ఇవే

కోలీవుడ్: 2021 సంవత్సరాంతానికి చేరుకున్నాం. డిసెంబరు మాత్రమే మిగిలి వుంది. ఈ నెలలో అనేక చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. వాస్తవానికి 2021 కూడా 2020 తరహాలోనే ఏమాత్రం కలిసిరాలేదని చెప్పాలి. 2021 ఏప్రిల్‌ నుంచి సెప్టెంబరు వరకు కరోనా రెండో దశ లాక్‌డౌన్‌ కొనసాగింది. ఆ తర్వాత కరోనా ఆంక్షల సడలింపుతో ఒక్కో చిత్రం విడుదలవుతూ వచ్చింది. ఆ తర్వాత రాష్ట్రంలో కరోనా వైరస్‌ వ్యాప్తి తగ్గు ముఖం పట్టడంతో వంద శాతం సీటింగ్‌ కెపాసిటీతో సినిమాల ప్రదర్శనకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీంతో దీపావళికి పలు పెద్ద చిత్రాలతో పాటు మరికొన్ని సినిమాలు విడుదలయ్యాయి. ఇపుడు డిసెంబరులో అనేక చిత్రాలు విడుదలకు సిద్ధమయ్యాయి. 


వీటిలో ‘బ్యాచిలర్‌’, ‘తల్లిపోగాదే’, ‘జెయిల్‌’, ‘తేల్‌’, ‘మురుంగకాయ్‌ చిప్స్‌’, ‘యాంటి ఇండియన్‌’, ‘3.33’, ‘బార్డర్‌’, ‘ప్లాన్‌ పణ్ణి పణ్ణనుమ్‌’, ‘పిశాచు-2’, ‘కొంబు వెచ్చ సింగమడా’, ‘యాదుం ఊరే యావరుమ్‌ కేలీర్‌’, ‘మామనిదన్‌’, ‘కడైసి వివసాయి’, ‘కాత్తువాక్కుల రెండు కాదల్‌’, ‘ఆనందం విలైయాడుం వీడు’, ‘ఇరుది పక్కం’, ‘పన్నికుట్టి’ తదితర సినిమాలు విడుదల కానున్నాయి. అయితే, ఈ చిత్రాల విడుదలలో మార్పులు చేర్పులు చోటుచేసుకునే అవకాశాలు లేకపోలేదు. మొత్తంమీద ఈ యేడాది మొత్తానికి డిసెంబరు ఒక్క నెలలోనే అధిక సంఖ్యలో సినిమాలు విడుదలవుతున్నాయి.

Advertisement