Abn logo
Nov 1 2020 @ 02:34AM

మణిరత్నం... ‘నవరస’ భరితం

Kaakateeya

జయాపజయాలతో సంబంధం లేకుండా భారతీయ సినీ పరిశ్రమపై తనదైన ముద్రవేసిన దర్శకుడు మణిరత్నం. ప్రయోగాలకు వెరువని ఆయన ఈ తరంలో అందుబాటులోకి వచ్చిన డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌లపైనా తనదైన ముద్ర వేస్తున్నారు. తొమ్మిది మంది దర్శకులు, తొమ్మిదిమంది నటులతో తొమ్మిది భాగాలుగా ఆయన నిర్మిస్తున్న ‘నవరస’ వెబ్‌సిరీస్‌ ఓ కొత్త ట్రెండ్‌కు నాంది పలకడం ఖాయం అంటున్నారు సినీ విశ్లేషకులు. దక్షిణాదిలోనే కాదు దేశంలోనే ఈ తరహాలో భారీస్థాయిలో నటులు, దర్శకులతో ఓ వెబ్‌సిరీస్‌ను నిర్మించడం ఇదే తొలిసారి అని చెబుతున్నారు. 

హాస్యం, శృంగారం, భయానకం... ఇలా నవరసాలతో ఈ వెబ్‌సిరీస్‌ తెరకెక్కుతోంది. అయితే మణిరత్నం దీనికి దర్శకత్వం వహించడం లేదు. మరో దర్శకుడు జయేంద్రతో కలసి ఆయన ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌ కోసం ఈ వెబ్‌సిరీ్‌సను నిర్మిస్తున్నారు. ప్రతి ఎపిసోడ్‌ను ఒక్కో దర్శకుడు తెరకెక్కిస్తారు. ఈ వెబ్‌సిరీ్‌సతో అరవింద్‌స్వామి దర్శకుడిగా మారడం విశేషం. నటుడు సిద్ధార్థ కూడా ఓ ఎపిసోడ్‌కు దర్శకత్వం వహిస్తారని సమాచారం.


మణిరత్నం దర్శకత్వం వహించే భాగంలో తమిళ హీరో సూర్య నటిస్తారని వార్తలు వచ్చినా ఇంకా ధృవీకరించలేదు. బిజో నంబియార్‌, కేవీ ఆనంద్‌, గౌతమ్‌ మీనన్‌, కార్తిక్‌ సుబ్బరాజ్‌, పొన్‌రామ్‌, హలిత షలీమ్‌, కార్తీక్‌ నరేన్‌, రతీంద్రన్‌ మిగిలిన ఎపిసోడ్లకు దర్శకత్వం వహిస్తున్నారు. తొమ్మిది కథల్లో రేవతి, సూర్య, విజయ్‌ సేతుపతి, సిద్ధార్థ, అరవిందస్వామి, నిత్యామీనన్‌, ఐశ్వర్యారాజేష్‌, రిత్విక, పూర్ణ, ప్రకాశ్‌రాజ్‌, బాబీసింహ, జై, స్నేహ తదితరులు నటిస్తున్నారు. ఏ. ఆర్‌ రెహమాన్‌, గోవింద్‌ వసంతన్‌, జిబ్రాన్‌ సంగీతం అందిస్తున్నారు.

Advertisement
Advertisement