Advertisement
Advertisement
Abn logo
Advertisement

లక్ష యువగీతార్చనకు తరలిరండి

షాద్‌నగర్‌ అర్బన్‌: విశ్వహిం దూ పరిషత్‌, భజరంగ్‌దళ్‌ సంయు క్త ఆధ్వర్యంలో 14వ తేదీన సికింద్రాబాద్‌ పరేడ్‌గ్రౌండ్‌లో లక్ష మంది యువకులతో లక్ష యువ గీతా అ ర్చన కార్యక్రమాన్ని నిర్వహిస్తామని వీహెచ్‌పీ రాష్ట్ర కార్యదర్శి బండారి రమేష్‌ తెలిపారు. కార్యక్రమానికి హాజరు కావాలని గురువారం షాద్‌నగర్‌కు వచ్చిన బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు బక్కని నర్సింహులు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు నర్సింహారెడ్డిలను ఆహ్వానించారు. భగవద్గీతలోని 40 శ్లోకాలను ఒకేసారి లక్షమందితో పారాయణం చేస్తామని తెలిపారు. 14ఏళ్ల నుంచి 40ఏళ్ల వయసు కలిగిన వారు వెబ్‌సైట్‌లో పేర్లను నమోదు చేసుకోవాలని కోరారు. మఠం రాచయ్య, బాలబ్రహ్మచారి, రంగయ్య, నాగేశ్వర్‌, జి.రమేష్‌, హన్మంత్‌రెడ్డి, వంశీ పాల్గొన్నారు.  

Advertisement
Advertisement