Advertisement
Advertisement
Abn logo
Advertisement

తన ప్రియుడిని నాన్నా అనమంటోంది.. నాన్నను అంకుల్ అనమంటోంది.. ఇద్దరూ కొడుతున్నారు.. ఓ 8 ఏళ్ల బాలిక చెబుతున్న నిజాలివి..!

ఇంటర్నెట్ డెస్క్: కేవలం ఎనిమిదేళ్ల వయసులోనే ఆ బాలిక నరకాన్ని చవిచూసింది. అప్పటివరకూ తల్లి ఆప్యాయతను మాత్రమే చూసిన ఆ బాలిక ఆమెలోని కర్కశత్వాన్ని తట్టుకోలేక చిగురుటాకులా వణికిపోయింది. తన ప్రియుడిని నాన్నా అని పిలవమంటూ ఆమె తన కూతురిని బలవంతం చేసేది. కన్న తండ్రినేమో అంకుల్ అనమంటూ పోరు పెట్టేది. కానీ.. ఆ చిన్నారికి మనసొప్పేది కాదు. చూస్తూ చూస్తూ.. తండ్రిని అంకుల్ అని పిలవలేకపోయింది. ఫలితం.. తల్లి, ఆమె ప్రియుడి చేతిలో నరకం అనుభవించింది. ఎట్టకేలకు వారి బారి నుంచి తప్పించుకుని చివరికి పోలీసులను ఆశ్రయించింది. హరియాణాలోని హిసార్ జిల్లాలో ఇటీవల ఈ ఘటన వెలుగు చూసింది.

బాలిక తల్లి కవితకు 14 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. అయితే.. గత మూడేళ్లుగా ఆమెకు భర్తతో వివాదం నడుస్తోంది. ఇద్దరూ కోర్టులో ఒకరిపై మరొకరు ఫిర్యాదు కూడా చేసుకున్నారు. ఈ క్రమంలోనే కవిత సూనీల్ వర్మ అనే వ్యక్తికి దగ్గరైంది. సూనీల్ స్థానికంగా ఓ కోచింగ్ సెంటర్ నిర్వహిస్తుంటాడు. కవిత తన బిడ్డతో పాటూ సునీల్‌తో కలిసి జీవిస్తోంది. అయితే.. సునీల్‌ను నాన్నా అని పిలవాలంటూ కూతురిపై ఒత్తిడి తెచ్చేది. సునీల్ కూడా ఈ విషయమై చిన్నారిని గదిలో వేసి కొట్టేవాడు. చేతికి ఏది అందితే దాంతో చితకబాదేవాడు. తల్లి అడ్డుపడకపోగా అతడికి వంతపాడేది. ఈ క్రమంలో బాలిక అక్టోబర్ 15న అక్కడి నుంచి పారిపోయి తండ్రి వద్దకు చేరుకుంది. ఆ తరువాత పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాలిక ఫిర్యాదు మేరకు వారు నిందితులిద్దరిపై కేసు నమోదు చేశారు.

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement