Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఎంత పని చేశావ్ తల్లి.. భర్త కోప్పడ్డాడని ఐదుగురు పిల్లలను తీసుకెళ్లి.. ఇలా దారుణంగా..

ఇంటర్నెట్ డెస్క్: ఆమెకు కొన్నేళ్ల క్రితం ఓ వ్యక్తితో వివాహం అయింది. ఈ క్రమంలోనే ఏడుగురు పిల్లలకు జన్మనిచ్చింది. అప్పటి వరకూ బాగానే సాగిన ఆమె వైవాహిక జీవితంలో.. కొద్ది రోజుల క్రితం నుంచి గొడవలు ప్రారంభమయ్యాయి. తాజాగా.. శనివారం ఉదయం కూడా ఓ విషయంలో ఆమె భర్త తనపై కోప్పడ్డాడు. దీంతో ఆమె సంచలన నిర్ణయం తీసకుంది. ఐదుగురు పిల్లలను బయటికి తీసుకెళ్లి దారుణానికి పాల్పడింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..


రాజస్థాన్‌లోని కోటా ప్రాంతానికి చెందిన బాదామ్ దేవి (40)కి శివ్‌లాల్ అనే వ్యక్తితో కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది. ఈ క్రమంలోనే వారు.. ఏడుగురు పిల్లలకు జన్మనిచ్చారు. కాగా.. కొద్ది కాలం క్రితం నుంచి బాదామ్ దేవి, శివ్‌లాల్ మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. తరచూ భార్యభర్తలు తగువులాకుంటూ ఉండేవారు. ఈ నేపథ్యంలోనే శనివారం ఉదయం కూడా వారిద్దరి మధ్య ఓ విషయంలో గొడవ జరిగింది. భర్త కోప్పడటంతో.. తీవ్ర మనస్తాపం చెందిన బాదామ్ దేవి.. ఐదుగురు పిల్లలను తనతోపాటు ఇంటి నుంచి బయటకు తీసుకెళ్లింది. 


అనంతరం గ్రామ శివారులో ఉన్న బావిలో పిల్లలను పడేసి.. ఆ తర్వాత తాను కూడా ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు విడించింది. ఆదివారం ఆమె మృతదేహం నీటిలో తేలటంతో.. గ్రామస్థులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ సందర్భంగా శివలాల్ మాట్లాడుతూ.. తన భార్య శనివారం మధ్యాహ్నం ఇంటి నుంచి బయటికి వెళ్లిందని.. సాయంత్రం అయినా తిరిగి రాకపోవడంతో చుట్టుపక్కల వారిని వాకబు చేసినట్టు చెప్పాడు. ఇటువంటి నిర్ణయం తీసుకుంటుందని అనుకోలేదని పేర్కొన్నాడు. Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement