Advertisement
Advertisement
Abn logo
Advertisement

‘అమ్మా.. నీకు పుట్టడమే నేను చేసిన పాపమా? నాన్న నీతో మాట్లాడటం లేదని నా ప్రాణం తీశావేం..’

అమ్మా.. నీ గర్భంలో ఉండగా తొమ్మిది నెలలపాటు నన్ను కంటికి రెప్పలా జాగ్రత్తగా చూసుకున్నావు. రోజు రోజుకూ పెరుగుతూ.. భారంగా మారినా మనస్ఫూర్తిగా భరించావు. కడుపులో ఉండి నిన్ను తన్నిన ప్రతిసారి.. ఆ బాధను ఆనందంగా స్వీకరించావు. చివరికి పురిటి నొప్పులను సైతం తట్టుకుని నాకు జన్మనిచ్చావు. ఇవన్నీ చేసిన నీకు.. మూడు నెలలకే మోయలేనంత భారంగా మారానా అమ్మా. నాన్న నీతో మాట్లాడటం లేదని నా ప్రాణం తీశావు. ఇది నీకు న్యాయమా అమ్మా..


ఊపిరి పోసిన నువ్వే.. వాటర్ ట్యాంక్‌లో ముంచి నా ప్రాణం తీశావ్. పైగా ఏమీ తెలియనట్టు.. కిడ్నాప్ డ్రామా ఆడావ్. పోలీసులకు ఫిర్యాదు చేసి.. లేని పోనివన్నీ చెప్పావ్. చివరికి వాళ్లు గట్టిగా అడగడంతో చంపింది నువ్వే అని ఒప్పుకున్నావ్. ఇంత కఠినంగా ఎలా మారావ్ అమ్మా? మళ్లీ అమ్మాయినే కన్నావని నానమ్మ, తాతయ్య, నాన్న.. ఇవాళ నిన్ను ఇబ్బంది పెట్టిండొచ్చు.. వాళ్లు నీతో మాట్లాడం మానేసుండొచ్చు. కానీ రేపటి రోజున నా బోసి నవ్వును చూసైనా వారిలో మార్పు వచ్చేది కదమ్మా. పోనీ అప్పటికీ వారిలో మార్పు రాకపోతే.. నా పుట్టుకకు కారణం నువ్వు కాదు.. నాన్నే అని తాతయ్య వాళ్లకు చెప్పుండాల్సింది కదమ్మా. అంత ధైర్యం చేయలేకపోతే.. ఏ అనాథ ఆశ్రమంలోనో చేర్పించి ఉండొచ్చు. కనీసం అక్కడైనా బతికేదాన్ని. నేను చూసిన తొలి రూపం నీదే. నేను చూసిన తొలి ప్రేమ నీదే. నేను తిన్న తొలి ముద్దు కూడా నీదే. ఇవన్నీ చూసి.. మళ్లీ జన్మంటూ ఉంటే.. నీ కడుపులోనే పుట్టాలని దేవుణ్ని వేడుకున్నా. కానీ.. నీకు పుట్టడమే నేను చేసిన పాపం అని ఇప్పుడు అనుకుంటున్నా. 


అయినా తప్పు మొత్తం నువ్వే చేశావని నేను అనడం లేదు. హత్య చేసింది నువ్వు మాత్రమే అని ముంబై పోలీసులు నిన్ను అరెస్ట్ చేశారు. ప్రత్యేక్షంగా దోషివి నువ్వే అయినప్పటికీ.. నువ్వు నన్ను హత్య చేసేందుకు కారణమైన నాన్న, తాతయ్య, నానమ్మ అందరూ నా దృష్టిలో నేరస్థులే. వారిని కూడా పోలీసులు అరెస్ట్ చేయాలి. అప్పుడే నాకు నిజమైన న్యాయం దక్కుతుంది’Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement