Abn logo
Aug 6 2020 @ 00:34AM

ముగ్గురు కూతుళ్లతో సహా తల్లి అదృశ్యం

ఘట్‌కేసర్‌ రూరల్‌ : ముగ్గురు కూతుళ్లతో సహా తల్లి అదృశ్యమైన ఘటన ఘట్‌కేసర్‌ పోలీ్‌సస్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. బాలాజీనగర్‌లో నివాసముండే రౌతు దుర్గారావు కూరగాయల షాపు నిర్వహిస్తున్నాడు. బుధ వారం ఉదయం 5.30 గంటలకు దుకాణానికి వెళ్లి 7.30కు ఇంటికి వచ్చాడు. భార్య దుర్గ(30), పెద్దకూతురు నాగ లక్ష్మి(10), రెండో కూతురు కృష్ణవేణి(8), మూడో పాప రత్నకుమారి(7) ఇంట్లో కనిపించలేదు. తెలిసిన వారిని విచారించినా ఆచూకీ లేకపోవడంతో పోలీసులకు ఫిర్యా దు చేశాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్‌ తెలిపారు. 

Advertisement
Advertisement