Advertisement
Advertisement
Abn logo
Advertisement

చిరుతతో పోరాడిన మహిళ.. కొడుకును కాపాడేందుకు ఆ తల్లి ఎంత పోరాటం చేసిందంటే..

ఒక మహిళ తన బిడ్డను కాపాడుకునేందుకు ప్రాణాలను పణంగా పెట్టింది. ఏకంగా చిరుతపులితో పోరాడింది. దాదాపు కిలోమీటరు దూరం అడవిలో చిరుతపులితో పాటు పరిగెత్తి తన కొడుకును కాపాడుకుంది. ఆ క్రమంలో ఆమె తీవ్ర గాయాలపాలైంది. అయినా కొడుకును కాపాడుకున్నాననే సంతోషం ముందు ఆ గాయాలు ఆమెను పెద్దగా బాధించలేదు. ప్రస్తుతం తల్లీ, కొడుకు ఆస్పత్రిలో చికిత్స అందుకుంటున్నారు. 


మధ్యప్రదేశ్‌లోని సిద్ధి జిల్లాలో ఉన్న బిజారియా గ్రామం టైగర్ రిజర్వ్ ఫారెస్ట్‌కు సమీపంలో ఉంది. అప్పుడప్పుడు ఆ గ్రామం మీద పులులు దాడి చేస్తుంటాయి. ఆ గ్రామానికి చెందిన కిరణ్ బైజా అనే మహిళ సోమవారం ఉదయం ఇంటి బయట వంట చేస్తోంది. తన ఎనిమిదేళ్ల కొడుకు రాహుల్ అక్కడే ఆడుకుంటున్నాడు. ఆ సమయంలో ఓ చిరుతపులి అక్కడకు వచ్చి రాహుల్‌ను నోట కరుచుకుని పరిగెత్తింది. ఆ దృశ్యాన్ని చూసిన కిరణ్ కూడా చిరుతపులి వెంట పెద్ద కర్ర పట్టుకుని పరిగెత్తింది.


అడవిలో చిరుత పులిని దాదాపు కిలోమీటరు దూరం తరిమింది. దీంతో బాలుడిని వదిలేసిన చిరుతపులి కిరణ్‌పై దాడి చేసింది. కర్రతోనే కిరణ్ ఆత్మరక్షణ కోసం ప్రయత్నించింది. ఆ క్రమంలో ఆమె తీవ్రంగా గాయపడింది. చిరుత మరోసారి దాడి చేసే సమయానికి గ్రామస్థులు పెద్దగా అరుచుకుంటూ అక్కడికి వచ్చారు. దీంతో చిరుత అడవిలోకి పారిపోయింది. గాయపడిన కిరణ్‌ను, ఆమె బిడ్డను గ్రామస్థులు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారిద్దరూ కోలుకుంటున్నారు.  

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement