Abn logo
Sep 20 2021 @ 23:36PM

చదువుకున్న వారే అధికం!
నిరక్షరాస్యులు 30 మందే..

ఎంపీటీసీల విద్యార్హతలు ప్రకటించి పౌరసంబంధాల శాఖ

శ్రీకాకుళం,ఆంధ్రజ్యోతి, సెప్టెంబరు 20: ప్రాదేశిక ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. రాష్ట్రంలో సుదీర్ఘ ‘పరిషత్‌’ ఎన్నికలు ఇవేనేమో. చాలా కాలం నిరీక్షణ తరువాత వెల్లడైన ఫలితాల్లో గెలుపొందిన ఎంపీటీసీలు, జడ్పీటీసీలకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సారి యువత, మహిళలు ఎక్కువగా పదవులు దక్కించుకున్నారు. ఇందులో విద్యాధికులు ఎక్కువగా ఉండడం విశేషం. సోమవారం జిల్లా పౌర సంబంధాల శాఖ ఎంపీటీసీల విద్యార్హతలను ప్రకటించింది. జిల్లా వ్యాప్తంగా కేవలం 30 మంది మాత్రమే నిరక్షరాస్యులు ఉన్నట్టు తేల్చారు. పదో తరగతి చదివిన వారు 146 మంది, పదో తరగతి లోపు 11 మంది ఉన్నారు. ఇక ఇంటర్‌  చదివినవారు 81 మంది, డిప్లమో చేసిన వారు ఒకరు ఉన్నారు. గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేసిన వారు 59 మంది, పీజీ చేసిన వారు ముగ్గురు ఉన్నారు. బీఎల్‌ చేసిన వారు ఇద్దరు, ఎంబీబీఎస్‌ చదవిన వారు ఇద్దరు ఉన్నట్టు వెల్లడించారు. రెండు, మూడు తరగతులు చదివిన వారు చేరో ఒక్కరు ఉన్నారు. ఐదో తరగతి 49 మంది, ఏడో తరగతి 29 మంది, ఎనిమిదో తరగతి 16 మంది, తొమ్మిదో తరగతి చదివిన వారు 20 మంది ఉన్నట్టు అధికారుల నివేదికలు చెబుతున్నాయి.