Abn logo
Sep 26 2021 @ 15:40PM

మరింతగా బిగుస్తోన్న ఉచ్చు...

హైదరాబాద్ : కార్వీ స్టాక్ బ్రోకింగ్ ప్రైవేట్‌ లిమిటెడ్‌ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. రూ.3 వేల కోట్ల కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) విచారణను మరింత వేగవంతం చేసింది. ఈ క్రమంలోనే... కార్వీకి చెందిన రూ. 700 కోట్ల విలువైన షేర్లను నిన్న(శనివారం) ఫ్రీజ్‌ చేసిన విషయం తెలిసిందే.  ఆయన కుటుంబసభ్యుల షేర్లను కూడా ఫ్రీజ్‌ చేసింది. మొత్తంమీద పార్థసారధి చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా షేర్లను ఫ్రీజ్‌ జరిగినట్లు చెబుతున్నారు. మరిన్ని వివరాలిలా ఉన్నాయి. 


కార్వీలో జరిగిన భారీ కుంభకోణం ఇటీవల వెలుగులోకి  వచ్చిన విషయం తెలిసిందే. మదుపరుల షేర్లను వారి అనుమతి లేకుండా బ్యాంకుల్లో తాకట్టు పెట్టి తీసుకున్న .వందల కోట్ల రుణాలను షెల్‌ కంపెనీలకు మళ్లించిందనన్నది ప్రధాన ఆరోపణ. ఈ క్రమంలో భారీగా మనీల్యాండరింగ్‌ జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. తమ వద్ద ఉన్న షేర్లను తనఖా పెట్టి తీసుకున్న రుణాలకు సంబంధించి అసలు, వడ్డీ చెల్లించకుండా మోసం చేశారంటూ... హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌లు పోలీసులకు వేర్వేరుగా ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో... సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు.


ఈ క్రమంలో మరిన్ని విషయాలు వెలుగులోకొచ్చాయి.   మరోవైపు హైదరాబాద్, సైబరాబాద్‌ ల్లోని మూడు బ్యాంకుల నుంచి దాదాపు రూ. 1,100 కోట్ల మేరకు తీసుకున్న రుణాలకు సంబంధించి అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై కూడాఇప్పటికే నాలుగు కేసులు నమోదయ్యాయి. ఇందులో భాగంగా... రూ. 35 కోట్ల మోసానికి సంబంధించి సికింద్రాబాద్‌కు చెందిన వారి నుంచి అందిన ఫిర్యాదుతో హైదరాబాద్‌‌లో మరో కేసు నమోదైంది. కార్వీ ద్వారా డీమ్యాట్‌ ఖాతాలు తెరచిన మదుపరులు ఇచ్చిన పవర్‌ ఆఫ్‌ అటార్నీని దుర్వినియోగం చేసి పార్థసారథి తదితరులు భారీ మోసాలకు తెరలేపినట్లు పోలీసులు గుర్తించారు. మొత్తం రూ. 3 వేల కోట్ల మేరకు మోసం జరిగినట్లు ఈడీ భావిస్తోంది. కాగా... ఈ కేసుల నేపధ్యంలో... రానున్న రోజుల్లో కార్వీ మరిన్ని విపరిణామాలనెదుర్కోవాల్సి ఉంటుందని సంబంధిత వర్డాలు చెబుతున్నాయి.