Abn logo
Oct 24 2020 @ 13:36PM

నయన్ సినిమా కూడా ఓటీటీలోనే..!

Kaakateeya

సౌతిండియా లేడీ సూపర్‌స్టార్ నయనతార నటించిన చిత్రం `మూకుత్తి అమ్మన్`. అమ్మవారి పాత్రలో నయనతార నటించింది. ఆర్జే బాలాజీ ఈ సినిమాను రూపొందించారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు ఆకట్టుకున్నాయి. లాక్‌డౌన్ కారణంగా ఈ సినిమా విడుదల వాయిదా పడింది. 


ఇప్పుడు థియేటర్లు తెరుచుకున్నప్పటికీ ఈ సినిమాను ఓటీటీ వేదికగానే విడుదల చేయాలని చిత్రయూనిట్ నిర్ణయించుకుంది. ఈ విషయాన్ని బాలాజీ ట్విటర్ ద్వారా వెల్లడించారు. ఈ ఏడాది దీపావళి సందర్భంగా డిస్నీ+హాట్‌స్టార్ వేదికగా ఈ సినిమా విడుదల కాబోతోంది. 

 

Advertisement
Advertisement