Abn logo
May 20 2020 @ 04:12AM

మోదీ, కేసీఆర్‌ నిర్లక్ష్యంతోనే లాక్‌డౌన్‌ కష్టాలు

 రూ. 20 లక్షల కోట్ల ప్యాకేజీ పేదలకా, కార్పొరేట్‌కా?

 కాంగ్రెస్‌ వర్క్గింగ్‌ ప్రెసిడెంట్‌, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క


మహబూబాబాద్‌, మే 19 (ఆంధ్రజ్యోతి):ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్‌ నిర్లక్ష్యంతోనే ప్రజలు లాక్‌డౌన్‌ కష్టాలు ఎ దుర్కొంటున్నారని కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెం ట్‌, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు. కరోనా నియంత్రణలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని విమర్శించారు. జిల్లా కేంద్రంలో డీసీసీ, ఓబీసీ సెల్‌ ఆధ్వర్యంలో మం గళవారం దివ్యాంగులు, నిరుపేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో భట్టి విక్రమార్క మాట్లాడారు. నవంబర్‌, డిసెంబర్‌ మాసాల్లో ప్రపంచ వ్యాప్తంగా కరోనా విజృంభిస్తుండగా విదేశాల్లోనుంచి వచ్చే ప్రయాణికులకు టెస్ట్‌లు నిర్వహించకుండా నిర్లక్ష్యం వహించారని ఆరోపించారు.


రాజకీయ లబ్ధి కోసం ప్రధాని మోదీ ఆలస్యంగా నిర్ణయం తీసుకుని ప్రజలను ఇబ్బందుల్లోకి నెట్టారని మండి పడ్డారు. సమయానికి స్పందిస్తే దేశంలో లాక్‌డౌన్‌ పెట్టే పరిస్థితి రాకుండా ఉండేదన్నారు. వలస కార్మికులు, రైతులు, నిరుపేదలు ఇబ్బందులు పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం వలస కార్మికుల ప్రయాణ భత్యాలు కూడా ప్రభుత్వాలు మోయలేని ధీన స్థితిలో ఉందని ధ్వజమెత్తారు. రూ.20లక్షల కోట్ల ప్యాకేజీ ఎవరి కోసమో చెప్పాలని, పేదలకా లేక కార్పొరేట్‌ శక్తులకా అని ప్రశ్నించారు. వాస్తవానికి దేశంలో సుమారు 40కోట్ల వలస కార్మికులుంటే అందులో సగం 20 కోట్ల మందిని మాత్రమే చూపుతున్న కేంద్రం.. కేవలం రూ.350 కోట్ల మాత్రమే కేటాయించిందన్నారు.  తలా ఒక్కింటికి నెలకు రూ.180 చొప్పున కేటాయింపులు ఉన్నాయని, వాటితో నెల రోజులు ఆహారం లభిస్తుందా చెప్పాలన్నారు. వేల కిలో మీటర్ల కాలినడకన నడుస్తూ వలస కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.


ప్రజలంతా స్వీయ నియంత్రణతో ఇళ్లకే పరిమతమై కరోనాను నియంత్రిస్తుంటే సీఎం కేసీఆర్‌ మాత్రం హఠాత్తుగా మద్యం షాపులు తెరిపించి పోలీస్‌ పహారా మధ్య నడిపిస్తున్నారని విమర్శించారు. సీఎంకు రాష్ట్రం, ప్రజలు ఎక్కడా పోయిన ఫర్వాలేదని మండిపడ్డారు. కాంగ్రెస్‌ నేతలు నిరుపేదలకు తమ చేతనైనా సాయం అందిస్తూ ప్రజలకు అండగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. ఓబీసీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు మేకల వీరన్నయాదవ్‌ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కేంద్ర మాజీ మంత్రి పోరిక బలరాంనాయక్‌, ఓబీసీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు కత్తి వెంకటస్వామి, కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు జెన్నారెడ్డి భరత్‌చందర్‌రెడ్డి, ఆదివాసీ కాంగ్రెస్‌ జాతీయ ఉపాధ్యక్షుడు తేజావత్‌ బెల్లయ్యనాయక్‌, పొట్ల నాగేశ్వర్‌రావు, భూక్య మురళీనాయక్‌, గుగులోతు దస్రునాయక్‌, వెన్నం లక్ష్మారెడ్డి, రామగోని రాజు, చుక్కల ఉదయ్‌చందర్‌, గుగులోతు వెంకట్‌, తిప్పర్తి శ్రీధర్‌, కత్తి స్వామి, బానోత్‌ ప్రసాద్‌, రియాజ్‌ అన్సారీ, దుర్గా ప్రసాద్‌, వీహెచ్‌పీఎ్‌స జిల్లా అధ్యక్షుడు శంకర్‌ పాల్గొన్నారు.

Advertisement
Advertisement