Abn logo
May 21 2020 @ 03:39AM

400 కుటుంబాలకు ఎమ్మెల్సీ చేయూత

వాజేడు, మే 20: ఖమ్మం ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ  400 కుటుంబాలకు నిత్యావసర సరుకులను బుధవారం అందించారు. మండలంలోని ఆరుగుంటపల్లి, జగన్నాథపురం, బొల్లారం, దూలాపురంలోని పేద కుటుంబాలకు సరుకులు, కూరగాయలు అందజేశారు. ఆయన వెంట నూగూరు మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ బుచ్చయ్య, వాజేడు, వెంకటాపురం జడ్పీటీసీలు పుష్పలత, రమణ, మండల అధ్యక్షుడు రామకృష్ణారెడ్డి తదితరులు ఉన్నారు. 

Advertisement
Advertisement