Advertisement
Advertisement
Abn logo
Advertisement
Nov 11 2021 @ 10:34AM

కవితకు మళ్లీ ఎమ్మెల్సీ ఛాన్స్ ఉందా? లేదా?

హైదరాబాద్: టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు జరుగుతోంది. హైకమాండ్‌ను ప్రసన్నం చేసుకునేందకు ఆశావహులు తమ ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. అయితే నిజామాబాద్ మాజీ ఎంపీ, ప్రస్తుత ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మరోసారి ఛాన్స్ దక్కుతుందా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది.


సిట్టింగ్ ఎంపీగా 2019 పార్లమెంట్ ఎన్నికల్లో బరిలోకి దిగిన కవిత బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ చేతిలో ఓటమిపాలయ్యారు. అప్పటి నుంచి ఆమె ప్రత్యక్ష రాజకీయాలకు కొంత కాలం దూరంగా ఉన్నారు. నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ భూపతి రెడ్డి కాంగ్రెస్‌లోకి వెళ్లడంతో అనర్హత వేటుపడింది. దీంతో ఆ స్థానం ఖాళీ కావడంతో అక్కడి నుంచి కవిత ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. అయితే ఆమె పదవీ కాలం వచ్చే ఏడాది జనవరి 4తో ముగియనుంది. ఇప్పటికే స్థానిక సంస్థలకు ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయడంతో ఇప్పుడు మళ్లీ అదే స్థానం నుంచి అవకాశం వస్తుందా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది. 

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement