Abn logo
Oct 11 2020 @ 05:44AM

ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానం

Kaakateeya

టీఆర్‌ఎస్‌ సంక్షేమం, అభివృద్ధిని చేసే పార్టీలోకి చేరికలు

ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి


కడ్తాల్‌ : సంక్షేమం, అభివృద్ది, అన్నివర్గాల ప్రజలకు చేయూత ద్వారా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకుందని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రజారంజక పాలన, సాహసోపేత నిర్ణయాలు, పారదర్శక పాలన చూసి వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలతో పాటు ప్రజలు స్వచ్ఛందగా పార్టీలో చేరుతున్నారని ఆయన పేర్కొన్నారు. మండలంలోని ముద్విన్‌ గ్రామ పంచాయతీ పరిధి కోర్షకొండ తండా కు చెందిన గిరిజనులు ఎంపీపీ కమ్లీమోత్యనాయక్‌ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ సమక్షంలో టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. తండా నేతలు గోపాల్‌ నాయక్‌, దేవనాయక్‌, బీక్యానాయక్‌, హరిచంద్‌, సోమ్ల, గోపాల్‌, కృష్ణ, రమేశ్‌, రామచంద్ర, బోజ్య, శ్రీను, లాల్‌సింగ్‌, రమేశ్‌, సంతోష్‌, శ్రీను, రవీందర్‌, లస్కర్‌, దేవులా ఆధ్వర్యంలో పార్టీలో చేరిన గిరిజన నాయకులు, యువకులు, మహిళలకు  ఎమ్మెల్సీ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి స్వాగతించారు.


  ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ స్వార్థ శక్తులు ఎన్ని కుట్రలుపన్నినా టీఆర్‌ఎస్‌ పార్టీని ఎదుర్కొలేవని అన్నారు. ఇప్పటికే ప్రజా విశ్వాసం కోల్పోయిన విపక్షాలు వచ్చే సాధారణ ఎన్నికల నాటికి రాష్ట్రంలో కనుమరుగుకాక తప్పదన్నారు. అన్ని మారుమూల గ్రామాలు, తండాలకు వచ్చే మూడేళ్లలో బీటీ రోడ్లు నిర్మించి రవాణ సౌకర్యం మెరుగుపరుస్తామని తెలిపారు. కోర్షకుంట తండా అభివృద్ధికి తన వంతు సహకార అందిస్తానని చెప్పారు. ఈ సందర్భంగా ముద్విన్‌ గ్రామానికి చెందిన శివమణికి సీఎం సహాయ నిధి ద్వారా మంజూరైన రూ.4లక్షల ఎల్‌వోసీ ప్రొసీడింగ్‌ను బాధితురాలు తండ్రి శ్రీనుకు అందజేశారు. కార్యక్రమంలో టీఆర్‌ఎ్‌స్‌ జిల్లా, మండల నాయకులు గూడూరు భాస్కర్‌రెడ్డి, నేనావత్‌ విజయ్‌, మాదారం శేఖర్‌గౌడ్‌, శ్రీకాంత్‌రెడ్డి, రామచంద్రయ్య, సుమన్‌, నరేశ్‌, మాజీ ఎంపీటీసీ యాదయ్య, డాక్టర్‌ శ్రీనివాస్‌, తాళ్ల రవీందర్‌, శేఖర్‌నేత తదితరులు పాల్గొన్నారు. 


ముద్విన్‌ మండల కేంద్రంగా ఏర్పాటయ్యేలా చూస్తా

కడ్తాల్‌ మండల పరిధిలోని ముద్విన్‌ గ్రామాన్ని మండల కేంద్రంగా ఏర్పాటుకు ప్రజాప్రతినిధులతో కలిసి తన వంతు కృషి చేస్తానని, స్థానికుల విన్నపాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్తానని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి హామీ ఇచ్చారు. ముద్విన్‌ను మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలని 25 రోజులుగా చేస్తున్న రిలే నిరాహార దీక్షా శిబిరాన్ని ఎంపీపీ కమ్లీమోత్యనాయక్‌ తో కలిసి శనివారం ఎమ్మెల్సీ సందర్శించారు. దీక్షలకు సంఘీభావం ప్రకటించారు. దీక్షలో కవిత, కళమ్మ, మల్లమ్మ, పద్మ, సత్యమ్మ, వెంకటయ్య, జంగమ్మ, లక్ష్మమ్మ, నర్సమ్మ, చౌడమ్మ, శంకరమ్మ, కృష్ణయ్య, విజేందర్‌, కార్తీక్‌, హరికృష్ణ, మల్లమ్మ, రాములు, శంకరయ్య ,చంటి,మనీశ్‌ రెడ్డి, రాములు కూర్చున్నారు. ముద్విన్‌ను మండల కేంద్రంగా ప్రకటించే వరకూ దీక్షలు కొనసాగిస్తామని జేఏసీ నాయకులు యాదయ్య, వెంకటయ్య, రాజు, వినోద్‌, రామచంద్రయ్య, జంగయ్య, గోపాల్‌, ఎంపీటీసీ నిర్మలాదేవికాశీనాథ్‌రెడ్డి, రాఘవరెడ్డి తెలిపారు.


వచ్చే నెలలో బీటీ రోడ్డు పనులను ప్రారంభిస్తాం

మాడ్గుల : మండలంలోని ఇర్విన్‌-గిరికొత్తపల్లి బీటీ రోడ్డు పనులను వచ్చే నెలలో ప్రారంభించేలా చూస్తానని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. గిరికొత్తపల్లి గ్రామస్థులు ఏడో రోజు శనివారం రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఎమ్మెల్సి గ్రామానికి చేరుకోని దీక్షలకు సంఘీభావం తెలిపారు. త్వరలోనే రోడ్డు పనులను ప్రారంభిస్తామని నచ్చజెప్పి దీక్ష చేస్తున్న వారికి నిమ్మరసం ఇచ్చి  విరమింపజేశారు. కార్యక్రమంలో సుద్దపల్లి సర్పంచ్‌ వెంకటేశ్వర్లు గౌడ్‌, నర్సంపల్లి సర్పంచ్‌ హనుమనాయక్‌, నాయకులు గోపాల్‌రెడ్డి, జంగయ్య, సూదిని వెంట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

Advertisement
Advertisement