Advertisement
Advertisement
Abn logo
Advertisement

మెజారిటీ పెరిగిందని మాటతప్పడం సిగ్గుచేటు: అశోక్‌బాబు

అమరావతి: ఆనాడు మెజారిటీ లేదని కౌన్సిల్ రద్దుచేస్తామన్న ప్రభుత్వం.. ఈనాడు వైసీపీ మెజారిటీ పెరిగిందని మాటతప్పడం సిగ్గుచేటని ఎమ్మెల్సీ అశోక్‌బాబు మండిపడ్డారు. కౌన్సిల్ రద్దుచేస్తే నష్టపోయేది ప్రభుత్వమేనని గతంలోనే చెప్పామన్నారు. కౌన్సిల్ రద్దు, ఏర్పాటు అనేది రాష్ట్రాల చేతిలో ఉండదన్నారు. మెజార్టీ పెరిగిందనే కౌన్సిల్ రద్దుపై ప్రభుత్వం వెనకడుగు వేసిందని వ్యాఖ్యానించారు. కేవలం 3 రాజధానుల బిల్లుని తిరిగి ఆమోదించుకోవడానికే ఈ ప్రభుత్వానికి ఇప్పుడు కౌన్సిల్ అవసరం వచ్చిందన్నారు. ప్రభుత్వ ప్రజావ్యతిరేక నిర్ణయాలపై టీడీపీ పోరాడుతుందని చెప్పారు. 


Advertisement
Advertisement